PLEASE Click here To view the photographs of Certification Program held on 29-9-2016
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో ఈ రోజు, అనగా 29-10-2016 న శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి శ్రీ సత్య సాయి ఉచిత టైలరింగ్ శిక్షణ శిభిరం మూడవ బ్యాచ్ వారికి సర్టిఫికెట్స్ బహుకరణ కార్యక్రమము ఉస్మాన్ గంజ్ లో గల శ్రీ సత్య సాయి సేవ కేంద్రము నందు, అత్యంత భక్తి శ్రద్ద ల తో దిగ్విజయముగా జరిగినది. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, శ్రీ ఎం వి ఆర్ శేష సాయి, రాష్ట్ర సమన్వయ కర్త SSSVIP DR కృష్ణ కుమార్ లు ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు. శ్రీ MVR శేష సాయి జ్యోతి ప్రకాశం గావించగా, క్రార్యక్రమము ప్రారంభమైనది. శ్రీమతి సీత మహాలక్ష్మి, గతంలో డిసెంబర్, 2015 నుండి, ఇప్పటి వరుకు మూడు బచ్స్ ట్రైనింగ్ విజయ వంతముగా చేపట్టినట్టు, మొత్తము, 64 మహిళలు, కుట్టు శిక్షణ పొందినట్టు, ముగ్గురికి కుట్టు యంత్రములు, కూడా కోటి సమితి పక్షాన బహుకరించినట్టు, . శిక్షణ తో పాటు, పలువురు, ఆధ్యాత్మిక ,సేవా కార్యక్రమాలలో పాల్గొన్నటుగా స్వాగత వచనాలు పలుకుతూ తెలియ జేశారు. రెండవ బ్యాచ్ లో శిక్షణ పొందిన శ్రీమతి వాణీ, గంగవేణి, స్వాతి, స్వచ్ఛందంగా, మూడవ బ్యాచ్ కార్యక్రమాలలో పాల్గొని, వారి అమూల్య సేవలు అందించారు. శ్రీ ఎం వి ఆర్ శేష సాయి, మరియు DR కృష్ణ కుమార్, మూడవ బ్యాచ్ లో 2-7-2016 నుండి 16-9-2016 వరకు 75 రోజుల పాటు, 200 గంటలు శిక్షణ పొందిన వారికీ, 15 మందికి సర్టిఫికెట్స్ ను జిల్లా అధ్యక్షులు, డ్ర్. కృష్ణ కుమార్, శ్రీమతి సునంద, అసిస్టెంట్ INCOME టాక్స్ - కమీషనర్ అంద జేశారు. జిల్లా అధ్యక్షులు వారు మాట్లాడుతూ, కోటి సమితి చేపడుతున్న, వివిధ సేవా కార్యక్రమాలను, కొనియాడుతూ, టెన్త్ క్లాస్ విద్యార్థులకు, ఉచిత TUITIONS , మరియు, బ్యూటీ పార్ల, మెహందీ లలో కూడా శిక్షణ కార్యక్రమాలను చేపట్టవల్సినదిగా, సూచించారు.dr కృష్ణ కుమార్ మాట్లాడుతూ, 75 రోజులు, 200 గంటలు, శిక్షణ పూర్తి చేసుకున్న వారిని అభినందిస్తూ, వారు ప్రధాన మంత్రి పధకం క్రింద వారు లోన్ కూడా తీసుకొనుటకు, అర్హులైనట్లుగ తెలిపారు. ఈ కార్యక్రమములో, శ్రీమతి అనిత గారు కోచ్ ని, కోటి సమితి పక్షాన, అసిస్టెంట్ INCOME టాక్స్ - COMMISSIONER శ్రీమతి సునంద గారు, మొమెంటో తో శాలువాతో, ఘనంగా సత్కరించారు. కన్వీనర్ పి. విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతో, జిల్లా అధ్యక్షులు, సూచించిన ప్రకారము, అక్టోబర్ 15 నుండి 4 వ బ్యాచ్ ప్రారంభము అవుతుందని, ఈ సదావకాశమును, స్థానికులు, వినియోగించు కోన దలచిన వారు వారి పేరు ను 88865 09410 కి ఫోన్ చేసి నమోదు కొనవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమములో శ్రీమతి సీత మహా లక్ష్మి, శ్రీమతి రేణుక, విజయ లక్ష్మి, యం ఎల్ నరసింహ రావు, ఎం చక్రధర్, మణికంఠ, వెంకట రావు, చల్లమల్ల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. స్వామి వారికీ మంగళ హారతి తో కార్యక్రమము ముగిసినది. సమితి కన్వీనర్ పి.విశ్వేశ్వర శాస్త్రి.