Tuesday, January 31, 2017

SRI SANJEEVA NARASIMHA APPADU VISIT TO VOCATIONAL TRAINING CENTRE, KOTI HYD. 31-1-2017

Please Click here to VIEW the photos of Prashanti Nilayam Darshan and Vocational Traning Convocation AND SRI SANJEEVA NARASIMHA APPADU VIST TO VOCATIONAL TRAINING CENTRE DATED 31-1-2017

Please Click here to see the Video of SRI SANJEEVA NARASIMHA APPADU GIVING TRAINING IN RANGOLI ON 31-1-2017 @ Vocational Training Convocation
శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్, సభ్యుల ఆహ్వనం మేరకు మారిషస్ శ్రీ సంజీవ నరసింహ అప్పడు ముఖ్య అదితి గా విచ్చేసి, తెలుగు భాషలోని మాధుర్యం ఏ భాషలో లేదని, శ్రీ సత్య సాయి అవతార కాలం లో మనము కూడా వారి సమకాలీలుగా ఉండట మన పూవా జన్మ సుకృతమేనమే, తెలుగు భాషా సంఘం అధ్యక్షులు శ్రీ సంజీవ నర్సింహఅప్పడు, శ్రీ సత్య సాయి సేవలో వుండి తెలుగు భాషపై వున్న మమకారంతో తెలుగు భాషా వ్యాప్తి కి చేసున్న కృషి ఫలితముగా వారు జీవిత సాఫల్య పురస్కారమును తీసుకొని నిమిత్తము వారు ఈ సారి భారత దేశమునకు రావడము, భారతదేశములోని ప్రధాన పుణ్య క్షేత్రములను దర్షించుకొని, ఈ రోజు, హైదరాబాద్. ఉస్మాన్ గంజ్ లో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, కి విచ్చేసి ఒకేషనల్ ట్రైనింగ్ టైలరింగ్ లో శిక్షణ పొందుతున్న వారికీ అనేక సందేశములిస్తూ, మహిళలను దృష్టిలో నుంచుకొని, వారి కున్న ముగ్గులు వేయడంలో నున్న నైపుణ్యమును ప్రదర్శించుచు, మెళుకువలు తెలియజేస్తూ, అందని ఆనంద పరిచి, సాధన ద్వారా చేయలేనిది లేదని, చెప్తూ, మారిషస్ ద్విపములో, అన్ని మందిరములలో తాను తీర్చిదిద్దిన రంగవల్లులు దర్శమిస్తాయని తెలుపుతూ, శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో కేవలము 5 నిమిషాలలో ఒక ముచ్చటైన రంగవల్లి ని వేసి అందరు వారి కరతాళధ్వనులతో ఆనందమును వ్యక్తం చేసిన అనంతరము, వారికీ కోటి సమితి పక్షాన, సమితి స్పిరిట్యుయల్ కో-ఆర్డినేటర్ శ్రీ ప్రభాకర్ శాలువా తో మరియు మొమెంటోతో ఘనముగా సత్కారించిన తదనంతరము సమితి కన్వీనర్ వందన సమర్పణ గావించగా స్వామి వారికీ మంగళ హారతితో కార్యక్రమము ముగిసినది. ఈ కార్యక్రములో తో శ్రీ ప్రభాకర్, శరన్ ప్రసాద్  , మహంకాళి నరసింహ రావు, పద్మావతి, వాణి, విజయ లక్ష్మి, భావన, మరియు బీటీషన్ కోర్స్, మరియు టైలారింగ్ లో శిక్షణ పొందుతున్నవారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tuesday, January 24, 2017

VOCATIONAL TRAINING CONVOCATION 22-1-2017 CHIEF GUEST: PROF K.ANIL KUMAR

Please Click here to VIEW the photos of Prashanti Nilayam Darshan and Vocational Traning Convocation dated 21, and 22nd January 2017 Please Click here to see the video of Vocational Training Convocation dated 22-1-2017 - Chief Guest Prof. Kamaraju Anil Kumar. at Sai Pavilion Hotel, @ Putta Parthi. Prashanti Nilayam 22nd January 2017
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి , హైదరాబాద్, ఒకేషనల్ ట్రైనింగ్ లో టైలరింగ్ లో 90 రోజుల శిక్షణ పూర్తిగావించిన 20 మందికి, ఒకేషనల్ ట్రైనింగ్ కవొకేషన్ కార్యక్రమునకు, శ్రీ ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించి, ప్రణాళిక, సిద్ధపరచి, ఈ రోజు, అనగా 21 జనవరి, శుక్రవారం, రాత్రి, శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం. ఎక్ష్ప్రెస్స్ ట్రైన్ లో, కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంలో గల షిరిడి స్వామి చిత్రపటము దగ్గర అందరము, సమావేశమై, వరుసక్రమంలో, మూడు సార్లు, ఓంకారము తో ప్రారంభించి, సాయి గాయత్రీ పఠించుచు, మూడవ ప్లాట్ఫారం లో నున్న మా ఎస్ 6 బోగిలోకి, మొత్తము 44 మంది ప్రవేశించి, ఎవరికి, కేటాయించిన వారి, వారి బెర్త్ ల లో, వారు, వుపక్రాంతులైనారు. 21 ఉదయం 5 గంటల కు ధర్మవరం రానేవచ్చింది. ఇడ్లి, వడ, కాఫీ టీ వేడి వేడి గా అనే మాటలు విన పడ్డాయి. అందరం లేచి, ట్రైన్లోనే, కాలకృత్యములు, ముగించుకొని, ప్రశాంతి నిలయం ఎప్పుడు, ఎప్పుడు చేరుకుంటామో, అనే ఆతురత ప్రతి ఒక్కరిలో కనిపించింది అనుటలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. మన శ్రేయోభిలాషి, మిత్రుడు, మన శ్రీ సతీష్ నాయక్ గారు RTC బస్సు ను ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ కు పంపి, అందరిని, మొత్తము సంఖ్య 47 మందిని ఒకే సారి ఎక్కించుకొని, ప్రశాంతి నిలయం లో మమ్మలిని కుమ్మరించారు. కొమ్మరించడమేకాకుండా, వారు మాకు ఏ మాత్రమూ ఆలస్యము లేకుండా, మార్గమద్యములోనే 150 ఆరు రూపాయల, టోకెన్స్ అంటే, 900 రూపాయలవి. అందజేసినారు. కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి వసతి కార్యాలయమునకు వెళ్లి మొత్తము 12 గదులను, మరియు ఆన్లైన్ లో బుక్ చేసిన మరి 2 గదులను, తీసుకోని రావడమే కాకుండా, వి ఐ పి గేట్ ప్రవేశమునకు, అర్హతా పత్రములను తీసుకోని వచ్చి, అందరము కలసి మొదటి దర్శనము నకు, వెళ్లి స్వామి ఆసిస్సులు అందుకొని, సర్టిఫికెట్స్ ను, ప్రసాదములను స్వామి, దగ్గర వుంచి, కార్యక్రమము విజయవంతముగా సాగునటుల ప్రార్ధన గావించి, గర్భ గుడి దర్శము గావించినాము. లేడీస్ అంతా షాపింగ్ కాంప్లెక్స్ కు వెళ్లి, వారి వారికి కావలసినవి తెచ్చుకొని, భోజనము ముగించుకొని, చైతన్య జ్యోతి, ధ్యాన వృక్షము లను దర్సించి, ఆనందభరితులై, అందరము చైతన్య జ్యోతి దగ్గర, ముఖ పుస్తకములో , ప్రత్యక్షముగా, మిత్రులకు దర్శనమిచ్చారు. చూచిన వారు వారి వారి like లతో, వారి ఆనందమును ప్రశంసలను, అందచేసి, మా ఉత్సహమును, రెట్టింపు చేసినారు. సాయంత్రము 5 గంటలకు, వేదం, భజనకు, హాజరై, దర్శము గావించి, భోజనాంతరం, రేపు అనగా 22 -1 -2017 న జరగవలసిన, ఒకేషనల్ ట్రైనింగ్ కవొకేషన్, కు కావలసిన ఏర్పాట్లు, సతీష్ గారు సమకూర్చిన, సాయి పెవిలిన్ హోటల్ సమావేశ మందిరము నందు, అందరము కలసి, ఏర్పాట్లు, ముగించుకొనగా, మొదటి రోజు కార్యక్రమము, ముగిసినది.
22 -1 -2017 వ రోజు, కార్యక్రమము, ఓంకారాము, వేదము, నగర సంకీర్తన, మరియు, వేదం, భజనలో పాల్గొని, దర్శము గావించుకొని, అందరము సాయి పెవిలియన్ సమావేశ మందిర ప్రాంగణం చేరుకొని,శ్రీ ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారిని వారి నివాసమునుండి, ఆటో లో తీసుకోని రావడము, జ్యోతి ప్రకాశనం గావించడము, బాలవికాస పిల్లలచే, వేదం పఠనం, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వచనములు పలుకగా, శ్రీమతి సీత మహాలక్ష్మి ఒకేషనల్ ట్రైనింగ్, ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రము, పూర్వాపరాలను వివరించగా, కుమారి శ్రీ శారద సుప్రియ, తన కంప్యూటర్ ల్యాబ్ టాప్ సహాయముతో, కార్యక్రమ సంబంధిత ఛాయా చిత్రాలములను, సేకరించి, వరుస క్రమములో,కన్నులకు, కట్టినట్లుగా చూపించగా, అనిల్ కుమార్ గారిని, వారి ఆరోగ్యము, సరిగా లేనందున, మరియు, వారి విదేశ యాత్ర కారక్రమమును దృష్టిలో, నుంచుకొని, లఘు సందేశము ఇవ్వ వలసించిగా, సవినయముగా, కన్వీనర్ గారు కోరడం, వారు అనేక విషయములు ప్రస్థవిస్స్తు , వృత్తి, ప్రవుత్తి, నివృత్తి, విషయములు అనేక ఉదాహరణములతో, బోధించి, భక్తుల స్థాయి ని గ్రహించి, వారి స్థాయిలోకి దిగి, వారిని అందరిని ఉత్తేజ భరితులను గావించి, ఆనందంలో ముంచి తేల్చారు అనుటలో ఏ మాత్రమూ సందేహము లేదు. తదనంతరము శిక్షణ పొందిన వారికీ సర్టిఫికెట్స్ ను బహూకరించి, కార్యక్రమమునకు సహకరించిన వారందరికీ, జ్ఞ్యాపికలను బహుకరించారు. శ్రీ సత్య సాయి సేవ సమితి, కోటి సమితి పక్షాన, శ్రీ ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారిని, సమితి సభ్యులు అందరూ కలసి, సముచితముగా, సత్కరించుకొని, ఆనంద పడ్డారు. శ్రీ ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు, మరియు, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి భగవానునికి, మంగళ హారతి సమర్పణతో, కానవొకేషన్ కార్యక్రమము, ముగిసినది.
తదుపరి, అందరూ, భోజన ప్రసాదము తీసుకోని, సామానులు ప్యాక్ చేసుకొని, ఐస్ క్రీమ్స్, తిని, మొగ వారు షాపింగ్ భావనమును దర్సించి, కొనుగోళ్లు తీసుకొని, కేక్లు ఇంటికి ప్యాక్ చేసుకొని, రాత్రి ట్రైన్ లో డిన్నర్ కు గాను, వడ తదితర, తినువస్తువులను తీసుకోని, మళ్ళి, సతీష్ గారి సహాయంతో, RTC బస్సు నేరుగా, మనము బస చేస్తున్న, N - 7 ప్రాంగణములో, బస్సు ని ఎక్కి, accomodation పెద్దలు ఉన్ని గారిని కలసి, కీస్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసి, వందనములు సమర్పించి, జై బోలో సత్య సాయి బాబా కి జై జై జై లో పలుకుకుంటూ, సెక్యూరిటీ ఆఫీస్ దగ్గర విభూతి ప్రసాదం ( 47 ) పాకెట్స్ తీసుకొని, త్వరలో దర్శన భాగ్యము ప్రసాదించమని ప్రార్ధన సలిపి, ప్రశాంతి నిలయం ప్రాంగణము, విడువ లేక విడిచి, సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ లో గల మందిరము, ఫోటో గ్యాలరీ దర్సించి, గణేశుని వద్ద ఫోటోలో తీసుకోని, అదే బస్సులో, ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ చేరి, అక్కడ మా సామానులను, ఒక ప్రదేశము లో నుంచి, వాలంటరీగా, వచ్చిన, ముగ్గురి సహాయముతో, సామాను భద్రపరచి, అందరము రోడ్ క్రాస్ చేసి, సాయి దర్భార్ మందిర ప్రవేశ ఆర్చ్ నుండి మూడు భజనలు పాడుకుంటూ, మందిరములో ప్రవేశించి, అక్కడ 15 నిమిషములు భజన కొనసాగించి, కోటి సమితి పక్షాన శ్రీమతి సౌజన్య గారికి, తదితరులకు జ్ఞ్యాపికలను బహూకరించి, స్వామి వారికీ హారతి సమర్పణ తో కార్యక్రమము విజయవంతముగా ముగిసినది.
అందరము మాకు కేటాయించిన S 8 లో స్వామి వారి అనుగ్రహాముతో, అందరి ఆసిస్సులతో, కాచిగూడ ఫ్లాట్ ఫారం నో. 1 లో దిగి మరల షిరిడి సాయి నాధుని చిత్ర పటము దగ్గర, నమస్సులు సమర్పించి, ఎవరి ఇండ్లకు వారు చేరినారు. వినయ్ నగర్ నివాసి, పద్మజ గారు వారికి కలిగిన ఆనందమును తెలియ జెసి అనేక కార్యక్రమంలో పాల్గొనే ప్రయాత్నము చేసెదనని తెలిపి నన్ను ఆనంద పరిచారు. జై సాయి రామ్
పేర్కొనబడిన లింక్లను నొక్కి, శ్రీ ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారి వీడియో సందేశమును, ఆడియో సందేశము, మరియు ఫోటోలను వీక్షించండి.