శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ( కుట్టు కేంద్రం ) ఉస్మాన్ గంజ్, తోప్ ఖనా లో మాతృశ్రీ 45 వ ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భముగా, భజన, సత్సంగ్ కార్యక్రమమును నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు, శ్రీమతి రాజమణి జ్యోతి ప్రకాశనం గావించిగా, వేదముతో కార్యక్రమము ప్రారంభమైనది. సాయి గాయత్రీ మంత్ర పఠనం తో ప్రారంభమై, 2003 సంవత్సరములో, స్వామి వారు ఇచ్చిన వీడియో ను చూచి ఆనందించారు. స్వామి వారికీ మంగళ హారతి ని శ్రీమతి పద్మవతి స్వాతి సమర్పించగా, అందరూ స్వామి వారి ప్రసాదమును తీసుకొనుట తో, కార్యక్రమము ముగిసినది. --- సాయిరాం.