భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి , హైదరాబాద్, ఒకేషనల్ ట్రైనింగ్ లో టైలరింగ్ లో 5వ బ్యాచ్ లో 1-3-2017 నుండి 2-6-2017 వరకు దాదాపు 90 రోజుల శిక్షణ పూర్తిగావించిన 20 మందికి, ఒకేషనల్ ట్రైనింగ్ కవొకేషన్ కార్యక్రమునకు, రాష్ట్ర అధ్యక్షలు శ్రీ ఎస్ జి చలమ్, ముఖ్య అతిధిగా ఆహ్వానించి, ప్రణాళిక, సిద్ధపరచి, ఈ రోజు, అనగా 8 జూన్ గురువారం , మూడు సార్లు, ఓంకారము తో ప్రారంభించి, సాయి గాయత్రీ పఠించుచు, శివమ్ లో సాయంత్రము భజన టైంకు హాజరై స్వామి పాదాల చెంత సర్టిఫికెట్స్ సమర్పించి, ఆసిస్సులు పొంది, హైదరాబాద్ జిల్లా అధ్యక్షలు గారి సర్టిఫికెట్స్ పై సంతకములు తీసుకొని ఒకేషనల్ ట్రైనింగ్ కవొకేషన్, కు కావలసిన ఏర్పాట్లు, సమకూర్చిన, మా మందిరము నందు, అందరము కలసి, ఏర్పాట్లు, ముగించుకొనగా, మొదటి రోజు కార్యక్రమము, ముగిసినది.
9-6-2017 న కార్యక్రమము, ఓం కారాము, వేదము, వేదం, భజనతో, దర్శము గావించుకొని, జ్యోతి ప్రకాశనం గావించి బాలవికాస పిల్లలచే, వేదం పఠనం, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వచనములు పలుకగా, శ్రీమతి సీత మహాలక్ష్మి ఒకేషనల్ ట్రైనింగ్, ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రము, పూర్వాపరాలను వివరించుచు ప్రొజెక్టర్ సహాయముతో, కార్యక్రమ సంబంధిత ఛాయా చిత్రాలములను, సేకరించి, వరుస క్రమములో,కన్నులకు, కట్టినట్లుగా చూపించగా,రాష్ట్ర అధ్యక్షలు వారిని, సందేశమివ్వవలసినిదైగా కన్వీనర్ గారు కోరడం, వారు అనేక విషయములు ప్రస్థవిస్స్తు , అనేక ఉదాహరణములతో, బోధించి, భక్తుల స్థాయి ని గ్రహించి, వారి స్థాయిలోకి దిగి, వారిని అందరిని ఉత్తేజ భరితులను గావించి నారు. తదనంతరము శిక్షణ పొందిన వారికీ సర్టిఫికెట్స్ ను బహూకరించి, కార్యక్రమమునకు సహకరించిన వారందరికీ, జ్ఞ్యాపికలను బహుకరించారు. శ్రీ సత్య సాయి సేవ సమితి, కోటి సమితి పక్షాన, రాష్ట్ర అధ్యక్షలు శ్రీ ఎస్ జి చలం గారిని సమితి సభ్యులు అందరూ కలసి, సముచితముగా, సత్కరించుకొని, ఆనంద పడ్డారు. ఈ కార్యక్రమములో, జిల్లా అధ్యక్షలు శ్రీ ఎం వి ఆర్ శేష సాయి, రాష్ట్ర SSSVIP CO-ORDINATOR DR KRISHNA KUMAR, ఐదు బ్యాచ్లలో శిక్షణ పొందివారు, బాలవికాస్ గురువులు, మహిళా ఇంచార్జి, సేవాదళ్ సభ్యలు, పాల్గొన్నారు.
భగవానునికి, మంగళ హారతి సమర్పణతో, కానవొకేషన్ కార్యక్రమము, ముగిసినది.
పేర్కొనబడిన లింక్లను నొక్కి, రాష్ట్ర అధ్యక్షలు శ్రీ ఎస్ జి చలం గారి వీడియో సందేశమును, ఆడియో సందేశము, మరియు ఫోటోలను వీక్షించండి.
సాయిరాం.