భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి , హైదరాబాద్, ఒకేషనల్ ట్రైనింగ్ టైలరింగ్ లో 10వ బ్యాచ్ లో శిక్షణ పొందుతున్న 18 మంది మేమంతా గాంధీ భావన్ మెట్రో రైల్వే స్టేషన్ లో మెట్రో ఎక్కి, దిల్ సుఖ్ నగర్ లో దిగి, శ్రీ సత్య సాయి పూర్వ అవతారమైన షిరిడి సాయి బాబా 100వ ఆరాధనా సంవత్సరము లో భాగంగా, మేమంతా పూజలు జరిపి, దర్శనము చేసుకొని, మనాలో కొంత మంది సంపూర్ణ ఆరోగ్యమునకు ప్రదానాలు సలిపి మళ్ళి అదే మెట్రో లో ప్రయాణించి, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ చేరుకొని, అందరూ పొందిన ఆనందమును ఒకరికొకరు పంచుకున్నారు.
ఈ ప్రయాణంలో మాకు, ప్రియా సాహు గారి పతి శ్రీ జగన్నాథ్ సాహు, గారు, మాకు, గాంధీ భావన్ స్టేషన్ లో ఏంతో సహకరించారు. దిల్ సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ లో శ్రీమతి లక్ష్మి మరియు, రాధాకృష్ణ గారు, VIP darshan చేయించి, ప్రసాదాలు ఇప్పించి, మళ్ళి ప్రత్యేక పూజలు ప్రతి ఒక్కరి గోత్ర నామాలతో, షిరిడి సాయి నాధుని అర్చాన చేయించి, ప్రత్యేకముగా నాకు స్వామి శేష వస్త్రమును నాకు బహూకరించి, ఏంతో ఆనందింప జేశారు.
మా ప్రయాణంలో, కుమారి శిరీష, శ్రీమతి దింపుల్, శ్రీమతి ప్రియా సాహు, శ్రీమతి ఫరీదా బేగం, కుమారి రాజనందిని, శ్రీమతి బిపాష, శ్రీమతి మీరజ్, శ్రీమతి అఫ్రీన్, కుమారి దేవి, కుమారి టీనా, శ్రీమతి రతన్ బెన్, కుమారి అనిత, కుమారి రోహిణి, శ్రీమతి అస్మా, కుమారి స్నేహ, కుమారి చైతన్య, శ్రీమతి రాధికా, శ్రీమతి వాణి, శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీమతి కల్పనా పాల్గొన్నారు.
మన కార్యక్రమమును వారి కెమెరా లో బంధించి, మనకు, ఫోటోలు, వీడియోస్ లు అందించిన వారు శ్రీ చిన్నా గారు. ఈ సందర్భముగా శ్రీ వేణు గారికి, కూడా ధన్యవాదములు.
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయముగా జరిపించిన మన బంగారు స్వామికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుగజేసికుంటూ సాయిరాం.