𝙎𝙋𝙀𝘾𝙄𝘼𝙇 𝘼𝙍𝙏𝙄𝘾𝙇𝙀 𝙊𝙉 𝙎𝙆𝙄𝙇𝙇 𝘿𝙀𝙑𝙀𝙇𝙊𝙋𝙈𝙀𝙉𝙏 𝘿𝙏 14-1-2024
Click here to view the Convocation u YouTube
Under the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba Varu, the 19th Skill Development Training Convocation in Tailoring was successfully conducted on January 5, 2024. The event commenced with the lighting of the lamp by Sri Sathya Sai Seva Organisations, Koti Samithi Convenor, P Visweswara Sastry, Skill Development State Incharge Smt Madhavi Latha, and Hyderabad District Skill Development Incharge Smt T Sreelatha.
Convenor P Visweswara Sastry extended a warm welcome to all the students from MAM Govt Modern Junior College who underwent training at Koti Samithi Skill Development Centre. He also welcomed the chief guests and honored Lecturer Padmavathy Garu. The students and Lecturer Smt Padmavathy expressed their gratitude for the support and encouragement provided by the Organization and extended their thanks to Bhagawan Sri Sathya Sai Baba Varu.
Certificates were presented to the 44 trainees who successfully completed the training from November 2, 2023, to January 4, 2024. Smt Madhavi Latha and Smt Sree Kala, during their evaluation, inspected all the garments stitched and meticulously documented records by the trainees. They applauded the dedication and hard work exhibited by the trainees.
Concluding the event, the Convenor expressed his thanks during the vote of thanks and announced that the 20th Batch is scheduled to commence on January 16, 2024. The program concluded with the offering of aarti to Bhagawan Sri Sathya Sai Baba
ఘనంగా 19 వ స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్ కాన్వకేషన్
DT 5-1-2024
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి హైదరాబాద్, స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్ 19 వ బ్యాచ్ లో 2-11-2023 to 4-1-2024 వరకు దాదాపు 2 నెలలు శిక్షణ పూర్తి గావించిన, నాంపల్లి జూనియర్ కాలేజీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్, మరియు సెకండ్ ఇయర్ లో కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ చదువు తున్న ( CGT ) 44 మందికి, స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్ లో, CONVOCATION నాంపల్లి రెడ్ హిల్స్ లో ఎం ఎన్ జె సత్రం “ఆశ్రిత కల్ప” ప్రాంగణములో, ఈ రోజు అనగా 5-1-2024 న ఉదయం 11-00 గంటలకు స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఆక్టివిటీ ఇంచార్జి, శ్రీమతి మాధవీ లత రెడ్డి, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆక్టివిటీ ఇంచార్జి టి శ్రీకళ, జ్యోతి ప్రకాశనం గావించగా, వేదముతో ప్రారంభము గావించబడినది. కోటి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వచనములు పలుకుతూ, కోటి సమితి లో ఈ వృత్తి విద్య శిక్షణా తరగతులలో ఇంత వరకు దాదాపు 520 మందికి, పైగా శిక్షణ పొందినట్లు తెలిపారు. తదనంతరము ఈ నాటి కార్యక్రమమునకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఆక్టివిటీ ఇంచార్జి, శ్రీమతి మాధవీ లత రెడ్డి, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆక్టివిటీ ఇంచార్జి టి శ్రీకళ, గారు 19 వ బ్యాచ్ లో శిక్షణ పూర్తి చేసికున్న 44 మందికి సర్టిఫికెట్స్ ను బహుకరించారు. ముందుగా శిక్షణ పొందిన నాయబా బేగం, సౌమ్య, రెహానా, లెక్చరర్ పద్మావతి మాట్లాడుతూ, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికీ, మరియు, విద్య బోధించిన గురువులకు, సహకరించిన కోటి సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఆక్టివిటీ ఇంచార్జి, శ్రీమతి మాధవీ లతా రెడ్డి, గారు మాట్లాడుతూ, శ్రీ సత్య సాయి సేవా సంస్థలలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ (టైలారింగ్) లో శిక్షణ పొందిన మీరు ఏంతో అదృష్టవంతులని, మీ కిచ్చిన ఈ సర్టిఫికెట్ ఏంతో విలువైనదని, ఆ సర్టిఫికెట్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా పేరున ఉన్నందున అని అన్నారు. మీ రికార్డ్స్, మీరు కుట్టిన దుస్తులు నన్ను ఎంతగానో ఆకర్షించాయని, తెలుపుతూ, రికార్డు బుక్ ను మరింత బాగా వ్రాయటానికి కొన్ని సూచనలు ఇచ్చారు. ఇంతవరకు 19 బ్యాచ్లు నిర్వహించిన కోటి సమితి వారిని ఎంతగానో అభినందించారు. 20 వ బ్యాచ్ జనవరి 16 వ తేదినుండి నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధంచేస్తున్న విషయము తెలిసి వారు మరిన్ని సూచనలు ఇచ్చారు.
హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆక్టివిటీ ఇంచార్జి టి శ్రీకళ, గారు మాట్లాడుతూ, టైలోరింగ్ తో పాటు, జ్యూట్ బాగ్ స్టిచ్చింగ్ లో కూడా శిక్షణ తరగతులను కూడా ఏర్పాటు గావించాలని, తెలుపుతూ ఈ మధ్య శివం లో నిర్వహించిన జూట్ బాగ్ శిక్షణ కార్యక్రమ వివరములు తెలిపారు. మీరు ఈ టైలరింగ్ ఇంకా ప్రావీణ్యత సాధన ద్వారా వున్న స్థితి నుండి ఉన్నత స్థాయికి రావాలని కోరారు.
కన్వీనర్ పి. విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, 20 బ్యాచ్ 16-1-2024 న ప్రారంభమగునని, ఆసక్తి గల స్థానిక, నిరుపేద
మహిళలు, 18 సంవత్సరములు పై బడ్డవారు, ఈ అవకాశం వియోగించుకోవాలన్నారు. సంప్రదించ వలసిన సెల్ నెంబర్ 8886509410.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి, మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజముగా ముగిసినది.