Tuesday, February 7, 2017

Tandularcharna Photos and Report dt 5-2-2017

div dir="ltr" style="text-align: left;" trbidi="on"> Please Click Here to see the PHOTOS of Tandularcharna dated 5-2-2017
శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటీ, సమితి, హైదరాబాద్, ఆధ్వర్యములో, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో " సాయి గాయత్రీ జపం మరియు తండులార్చన " కార్యక్రమమునకు, ఈ రోజు అనగా తేది : 5-2-2017. భక్తులు, సేవదాల్ సభ్యులు, ఆర్యకన్య, మనోరంజితం, హనుమాన్ వ్యాయామశాల పాటశాల విద్యార్ధులు, అందరూ, అబిడ్స్,ఇస్కాన్ మందిరం నుండి సాయి గాయత్రీ మంత్రము చదువుతూ, పుల్లారెడ్డి భవనములో నున్న శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్, హాలు, 6 వ అంతస్తుకు 9.00 గంటలకు చేరుకొని, శ్రీమతి భావన గారు, శ్రీమతి శ్రీ సీతా మహాలక్ష్మి, శ్రీమతి రేణుక గార్లు, కన్వినర్ విశ్వేశ్వర శాస్త్రి జ్యోతి ప్రకాశనము గావించగా, నిరాడంబరముగా, అత్యంత భక్తీ శ్రద్దలతో,కార్యక్రమము ప్రారంభము అయినది. స్వామి గళంలో స్వామితో, గాయత్రి మంత్రమును అందరు కలసి స్వర యుక్తముగా, పలికారు. స్వయముగా సత్య సాయి బాబా వారి గళంలో, గాయత్రీ మంత్రం విశిష్ట తెలిపే ఆడియో క్లిప్పింగ్స్ ను ప్లే చేయడమైనది. స్వామి తెలిపిన ముఖ్య విషయము, అందరూ కనుక గాయత్రీ మంత్రము పాటించిన, దేశమునకు, ఏ విపత్తులు సంభవించవని తెలిపారు. తరువాత, బాలవికాస్ గురువులు, కన్వీనర్, అందరు కలసి, గాయత్రీ మంత్రము యొక్క విశిష్టతను తెలిపారు. తదనంతరము, తండులార్చన " కార్యక్రమము, ప్రారంభమైనది. అందరికి, పళ్ళెము, పంచముఖీ,వేద మాత గాయత్రి హృదయ మద్య మందు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారున్న చిత్రపటము, బియ్యము, ఇచ్చి, మంత్రము విశిష్టతను తెలిపిన తదుపరి, తండులార్చన కార్యక్రమము, 108 సార్లు అందరు కలసి "ఓం సాయీశ్వరాయ విద్మహే, సత్య దేవాయ ధీమహి తన్న: స్సర్వ ప్రచోదయాత్ " మంత్రమును పలుకుతూ, తండులార్చనతో , శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్, హాలు, 6 వ అంతస్తు, మరుమ్రోగినది. ఈ పవిత్ర కార్యక్రమములో, మొత్తము 54 మంది , మంది పాల్గొని, స్వామి దివ్య అనుగ్రహమునకు, పాత్రుల్య్నారు. శ్రీమతి శ్రీ సీత మహా లక్ష్మి గారు భగవానునికి, హారతి, సమర్పణతో కార్యక్రమము, ముగిసినది.

No comments:

Post a Comment