Tuesday, September 19, 2017

19-9-2017 MAHILA DAY PROGRAM - SATSANG BY SMT D VARALAKSHMI.



Report dated 19-9-2017

శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ( కుట్టు కేంద్రం ) ఉస్మాన్ గంజ్, తోప్ ఖనా లో రోజు 19-9-2017 మహిళా దినోత్సవమును పురస్కరించుకొని, శ్రీ సత్య సాయి సేవకురాలు,  ప్రముఖ న్యాయవాది,  శ్రీమతి వరలక్ష్మి, గారి ఆధ్యాత్మిక, సత్సంగ కార్యక్రమము భజన,  నిర్వహించడమైనది. వరలక్ష్మి గారు ఒకేషనల్ ట్రైనింగ్ టైలారింగ్  లో శిక్షణ పొందుతున్న వారిని ఉద్దేశించి వారి సత్సంగము ప్రారంభించి,  వారు స్వామి కృపకు ఎలా పాత్రులైనారో, వివరిస్తూ, శ్రీ సత్యసాయి సేవ సంస్థలు నిర్వహిస్తున్న కుట్టు కేంద్రంలో  మీరు కష్టముతో కాకుండా ఇష్టముతో నేర్చుకొని, మీ పిల్లలను బాలవికాస్ తరగతులకు పంపాలని, నేను కూడా నా పిల్లలను బాలవికాస్ కు పంపడంవల్లనే నేను ఎంతో ప్రశాంతముగా నున్నానని వారు కూడా ప్రస్తుతము మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగము చేసుకుంటూ, స్వామి సేవలో వారు కూడా వున్నారని తెలియజేసారు. వరలక్ష్మి గారు స్వామి వారికీ మంగళ హారతి ని సమర్పించగా, నాటి సత్సంగ కార్యక్రమము ముగిసినది.
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, పక్షాన, ప్రముఖ వ్యాపారవేత్త  సునీత గారు  ఒక మొమెంటు నాటి ముఖ్య అతిధి ని ఘనముగా సత్కరించగా  అందరూ స్వామి వారి ప్రసాదమును  తీసుకొనుటతో,   కార్యక్రమము ముగిసినది. --- సాయిరాం.

నాటి కార్యక్రమంలో 6 బ్యాచ్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కుట్టు కేంద్రం ట్రైనీస్, మరియు నీలిమ, సునీత, భావన, ఆరాధన, వెంకట లక్ష్మి,  తదితరులు పాల్గొన్నారు. సమితి కన్వీనర్, వందన సమర్పణ గావించారు.





Wednesday, September 6, 2017

4th batch

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, ఆధ్వర్యములో ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమము గురువారం 20 వ తేదీ నుండి 4 వ బ్యాచ్ 90 రోజుల ఉచిత కుట్టు శిక్షణా శిభిరం, ఉస్మాన్ గంజు, టాప్ ఖానా, ( ప్రేమ్ సాయి క్యాలెండర్లు వారి ప్రెమిసెస్ లో ) శ్రీ సత్య సాయి సేవ కేంద్రంలో, ప్రారంభమైన విషయము విదితమే. ఈ శిక్షణా శిభిరంలో 21 మంది మహిళలు శిక్షన పొందుచున్నారు. ఈ రోజు, అనగా, 3-11-2016 న, 1 గంటలకు Dr కృష్ణ కుమార్ స్టేట్ కో-ఆర్డినేటర్, శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్, ముఖ్య అతిధిగా, విచ్చేసి, శిక్షణా మహిళలకు, నియమ నిభందనల,ప్రకారము, 200 గంటలు, శిక్షణా పొంది ఉండవలెనని, అప్పుడే, సర్టిఫికెట్ జారీ చేయబడునని, వాళ్ళ పిల్లలను, బలవికాస్, లో చేర్చమని, సలహా నిచ్చారు. శ్రీ సత్య సాయి సేవా కేంద్రమును, తమ పుట్టినిల్లుగా భావించి, ఇష్టముతో, శిక్షణలో, మెళుకువలు, తెలిసికొని, మీరే మళ్ళీ, తరువాయి, 5 వ బ్యాచ్ కు కోచింగ్ నిచ్చే స్థాయికి, చేరే విధముగా, నేర్చుకోవలసినగా, మరియు, మీ కుటుంబములో ఎవరన్నా, అనారోగ్యముతో నున్న వారికి, కూడా , తగు చికిత్స కూడా ఏర్పాటు చేయునటుల , సూచించారు. చివరగా శ్రీ సత్య సాయి సేవ సమితి, కోటి సమితి చేపడుతున్న, అనేక, ఆధ్యాత్మిక, సేవా, కొనియాడుతూ, కన్వీనర్ ను, సభ్యులను, అభినందించారు. ముఖ్యముగా, 3 వ బ్యాచ్ లో శిక్షణ పొంది, 4 వ బ్యాచ్ లో శిక్షణ నిస్తున్న, దాస పద్మావతి ని, వాణీ, మరియు స్వాతి లను కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు. కోటి సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి, వందన సమర్పణ గావిస్తూ, మెహందీ, మరియు బ్యూటీ పార్ల లో కూడా శిక్షణ తరగతులను, త్వరలో ఏర్పాటు, చేస్తున్నట్లు తెలిపారు.