Report
dated 19-9-2017
శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ( కుట్టు కేంద్రం ) ఉస్మాన్ గంజ్, తోప్ ఖనా లో ఈ రోజు 19-9-2017 న మహిళా దినోత్సవమును పురస్కరించుకొని, శ్రీ సత్య సాయి సేవకురాలు, ప్రముఖ న్యాయవాది, శ్రీమతి వరలక్ష్మి, గారి ఆధ్యాత్మిక, సత్సంగ కార్యక్రమము భజన, నిర్వహించడమైనది. వరలక్ష్మి గారు ఒకేషనల్ ట్రైనింగ్ టైలారింగ్ లో శిక్షణ పొందుతున్న వారిని ఉద్దేశించి వారి సత్సంగము ప్రారంభించి, వారు స్వామి కృపకు ఎలా పాత్రులైనారో, వివరిస్తూ, శ్రీ సత్యసాయి సేవ సంస్థలు నిర్వహిస్తున్న కుట్టు కేంద్రంలో మీరు కష్టముతో కాకుండా ఇష్టముతో నేర్చుకొని, మీ పిల్లలను బాలవికాస్ తరగతులకు పంపాలని, నేను కూడా నా పిల్లలను బాలవికాస్ కు పంపడంవల్లనే నేను ఎంతో ప్రశాంతముగా నున్నానని వారు కూడా ప్రస్తుతము మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగము చేసుకుంటూ, స్వామి సేవలో వారు కూడా వున్నారని తెలియజేసారు. వరలక్ష్మి గారు స్వామి వారికీ మంగళ హారతి ని సమర్పించగా, ఈ నాటి సత్సంగ కార్యక్రమము ముగిసినది.
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, పక్షాన, ప్రముఖ వ్యాపారవేత్త సునీత గారు ఒక మొమెంటు ఈ నాటి ముఖ్య అతిధి ని ఘనముగా సత్కరించగా అందరూ స్వామి వారి ప్రసాదమును తీసుకొనుటతో, కార్యక్రమము ముగిసినది. --- సాయిరాం.
ఈ నాటి కార్యక్రమంలో 6 వ బ్యాచ్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కుట్టు కేంద్రం ట్రైనీస్, మరియు నీలిమ, సునీత, భావన, ఆరాధన, వెంకట లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. సమితి కన్వీనర్, వందన సమర్పణ గావించారు.
No comments:
Post a Comment