Tuesday, December 26, 2017

26-12-2017 Vocational Training Centre Activity. Maintenance Day

26-12-2017 


ఈ రోజు స్వామి దివ్య అనుగ్రహముతో 7వ బాధే లో నున్న ట్రైనీస్ అందరు వారు కొట్టిన గౌనులు, సరిపెట్టికోట్లు, చూపించి చాలా ఆనందము పొందినట్లుగా తెలియజేసారు. 
శ్రీ చందు గారి సహాయముతో, చిన్న చిన్న కుట్టు  మెషిన్ సమస్యలు, యందు వల్ల వస్తాయో, తెలిపి, వాటిని ఏ విధముగా రిపేర్ చేసుకోవాలో, సెంటర్ లోని అన్ని కుట్టు యంత్రములను రిపేర్ చేస్తూ, సవివరముగా తెలిపినారు శ్రీ చందూలాల్ గారు. వారికి ఈ రోజు 800/- చెల్లించడమైనది. ( నరసింహ రావు గారిచే ) 







Wednesday, December 6, 2017

Report on 7th Batch Inauguaration and completion of 2 years Vocational Training Centre Report Photos & Press Clippings




స్వామి వారి దివ్య ఆశీస్సులతో, ఒకేషనల్ ట్రైనింగ్ కోర్స్ టైలరింగ్ కోర్స్ లో శిక్షణ కార్యక్రమాలు, రోజుకు రెండు సంవత్సరము పూర్తి చేసుకొన్నా వేళా, శ్రీ సత్య సాయి సంస్థలు, కోటి సమితి, ఒకేషనల్ ట్రైనింగ్ కోర్స్ శిభిరంలో, ఉస్మాన్ గంజ్ లో గల శ్రీ సత్య సాయి  ఒకేషనల్ ట్రైనింగ్ కోర్స్ టైలరింగ్ నూతనముగా, 7 బ్యాచ్ ను ప్రారంభించుకొని, రెండు సంవత్సరములు పూర్తి, చేసుకొని, మూడవ సంవత్సరములో అడుగిడిన వేడుకలో భాగంగా, ఒక కేక్ ను కట్ చేసి,   కార్యక్రమమును , అత్యంత భక్తి శ్రద్దలతో, జరుపుకొన్నారు. ఈనాటి కార్యక్రమమును,   Dr.  కృష్ణ కుమార్, SSS VIP కో-ఆర్డినేటర్,  జ్యోతి ప్రకాశము గావించగా, కార్యక్రమము భజన తో ప్రారంభమైనది

.
Dr.కృష్ణ కుమార్ మాట్లాడుతూ,  కోటి సమితి సభ్యులను మరియు వారి సేవలను కోనియడుతు, త్వరలో, మగ్గము, మరియు ఫాషన్ డిజైన్ లో కూడా శిక్షణ ప్రారంభించవలసినదిగా సూచన నిచ్చారు.    మధ్య భారత ప్రభుత్వం, స్త్రీ లందరు, కూడా, ఆర్ధిక స్వాలంబన మంటే, తమ కాళ్ళ పై తాము నిలబడవలెనని, చెప్పిన విషయమును, శ్రీ సత్య సాయి బాబా వారు 20 సంవత్సరములకు ముందే, చెప్పినట్లు తెలియచేసారు. ఎప్పుడైతే, మన వ్యక్తి గత నమ్మకాన్ని, పెంచుకుంటూ, భావంతుడున్నాడు, అనే విశ్వాసముతో ముందగు వేస్తామో, మనకు తెలియకుండానే, మనకు, శిక్షణ లోని నైపుణ్యము, అబ్బుతుందన్నారు. అబ్బిన నైపుణ్యమును పలువురికి పంచుకుంటూ రావాలన్నారు. విధముగా సేవలందిస్తున్నా పద్మావతి టైలారింగ్ లో శిక్షణ నిస్తున్న పద్మావతి గారిని అభినందిస్స్తు, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కు సిలబస్ ను తయారు చేసి సవివరముగా తెలియజేసారు.
కార్యక్రమములో, సునీత, సీతామహాలక్ష్మీ, విజయలక్ష్మి, స్వాతి, వాణి, పద్మావతి, నీలిమ తదితరులు పాల్గొన్నారు..  సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, స్వాగత వచనములు, పలికి, వందన సమర్పణ గావించగా, స్వామికి మంగళ హారతి సమర్పణ తో కార్యక్రమము ముగిసినది.

ఫోటోలు జత చేయడమైనది.విశ్వేశ్వర శాస్త్రి, సమితి కన్వీనర్ Dt 5-12-2017

Press Clippings