Let the colours of Holi spread the message of peace and happiness.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో ఈ రోజు అనగా 1-3-2018 న మధ్యాహన్నాము 1 గంటకు హైదరాబాద్, రాజేంద్ర నగర్లో గల BIRED కి అంటే BANKERS
INSTITUTE OF RURAL AND ENTREPRENEURSHIP DEVELOPMENT కేంద్రమునకు, నేను మా ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో టైలారింగ్ విభాగములో శిక్షణ పొందుతున్న 14 మంది, శ్రీమతి పద్మావతే, వాణి, మేఘన, రచన, జ్యోతి తివారి, సమత,సరితా, అనూష, లక్ష్మి, శైలజ, జ్యోతి లక్ష్మి, అంజమ్మ, మాధురి, మాధవి, మా డ్రైవర్, రాము గారు అందరము కలసి, జైలో కార్ లో 2 గంటలకల్లా చేరినాము. ముందుగా ఉదయమే ఫోన్ చేసి ప్రసాద్ గారికి, తెలియజేయగా, వారు ఏంతో, సంతోషించి, స్వాగతం, చెప్పగా, మళ్ళీ, బయలు దేరు సమయములో కూడా, వారికీ విన్నవించగా, వారు మా సంఖ్యను, అడిగి మాకు ప్రసాదమును మా కోసము స్పెషల్ గా నాగరాజు గారి సహాయముతో, మాకు తయారుచేయించినారు. మొదలుగా, మన మొదటి ప్రధాన మంత్రి, జవహర్లాల్ నెహ్రు గారు నాటిన ఒక వృక్షమును చూపించి, టైలారింగ్ విభాగమునకు సంబందించిన హాల్ ను, శిక్షణ పొందుతున్న, శిక్షకులను, వరుస క్రమములో అమర్చిన కుట్టు యంత్రములను, అన్నింటిని మాకు చూపించి, మమ్మల్ని అక్కడున్న వారందరికీ పరిచయము గావించారు మన శ్రీ కే ఎన్ ప్రసాద్ గారు. వాళ్ల గురువులు, శ్రీమతి నిర్మల గారు ఇచ్చిన డెమో తరువాత
మా టైలరింగ్ ట్యూటర్ శ్రీమతి పద్మావతి గారితో కూడా నేను డెమో ను ఇప్పించినాను. ( వీరికి కూడా సెల్ఫ్ కాంఫిడెన్స్ డెవలప్మెంట్ కోసము. ) వారు కూడా ఏ మాత్రము తడ బడ కుండా, వారి డెమో ను కొనసాగించారు.
తరువాత, మగ్గము, జరీ, నేర్చుకుంటున్నవారికి, బ్యూటిషన్ కోర్స్ హాల్ లో బ్యూటిషన్ కోర్స్ వారికీ, కంప్యూటర్స్ విభాగములో, కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకొంటున్నవారికి, మమ్మల్ని పరిచయము చేయడము, మేము అంతా వారితో ఇంటరాక్ట్ కావడము మాకందరికి ఏంతొ ఆనందాన్ని,కలిగించింది. BANKERS INSTITUTE OF RURAL AND
ENTREPRENEURSHIP DEVELOPMENT సంస్థ, వారు చేపడుతున్న వివిధ ప్రాజెక్ట్స్, మరియు అక్కడి వాతావరణము, మా అందరిని ఎంతగానో ఆకర్షించింది.
కోటి సమితి టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ సభ్యులు, ఈ కార్యక్రమాన్నంతా, తిలకించి, ఏంతో ఆనందపడి, అనూష, అంజమ్మ, అన్న మాటలు, ఇవి “ సార్ నాకు మగ్గము, జరదౌసి, (జరీ పని) కూడా ఇక్కడ నేర్చుకుంటా సార్, నేర్పిస్తారా " అని అడగడము, నేను ఇక్కడే వుండి నేర్చుకుంటావా అన్న మాటలకు " నేర్చుకుంటా" అనడం మాకు ఏంతొ ఆనందం న్నిచ్చింది. ముందుగా , స్వామికి, శ్రీ కె న్ ప్రసాద్ గారికి , మరియు వారి సిబ్బందికి, హృదయ పూర్వక కృతజ్ఞతలు, అందరికి సాయిరాంలు వందనములు తెలుపుకుంటూ, మా తిరుగు ప్రయాణము అదే క్యాబ్ జైలో లో బయలు దేరి క్షేమముగా చేరినాము. ఈ రోజు డైరెక్టర్ గారు సెలవులో ఉండము కొంత కొరతగానున్నది. వారికీ కూడా మా హృదయ పూర్వక కృతజ్ఞతలు -- మరియు అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ సాయిరాం.