భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి , హైదరాబాద్, ఒకేషనల్ ట్రైనింగ్ లో టైలరింగ్ లో 7వ బ్యాచ్ లో 5-12-2017 నుండి 20-3-2018
వరకు దాదాపు 100 రోజుల శిక్షణ పూర్తిగావించిన 15 మందికి, ఒకేషనల్ ట్రైనింగ్ కవొకేషన్ కార్యక్రమునకు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షులు శ్రీ నిమీష్ పాండ్య, హైదరాబాద్ సేవాదళ్ 50వ వ్యవస్థాపక దినోత్సవాల శుభారంభ వేళ జాతీయ స్థాయి బృందం హైదరాబాద్ సందర్శన సందర్భమును పురస్కరించుకొని జరుపుకొంటున్న వేడుకలో భాగముగా భగవానుడు నడయాడిన శివమ్ మందిర ప్రాంగణములో శ్రీ సత్య సాయి భజన మందిరం శివమ్ లో శ్రీ నిమేష్ పాండ్య గారి చేతులమీదుగా సర్టిఫికెట్స్ ప్రదానం గావించారు.
ఈ సందర్భమును పురస్కరించుకొని శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ 8 వ బ్యాచ్, ఈ నెల మర్చి 26 వ తేదీ నుండి టైలరింగ్ తరగతులు పూర్తి స్థాయి లో నిర్వహింప బడునని తెలిపారు.
సమితి కన్వీనర్,
పి. విశ్వేశ్వర శాస్త్రి
No comments:
Post a Comment