భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి , హైదరాబాద్, ఒకేషనల్ ట్రైనింగ్ లో అడ్వాన్స్డ్ టైలరింగ్ మరియు ఫాషన్ డిసైనింగ్ లో 9 వ బ్యాచ్ లో 9-9-2018 న ప్రారంభమైనది. శిక్షణ పొందుతున్నవారికీ టైలారింగ్ తో పాటు కుట్టు మెషిన్ రిపేరింగ్ కూడా నేర్పించాలని సంకల్పించి, ఈ రోజు మాస్టర్ శ్రీశైలం గారు రిపేరింగ్ లో పలు అంశాలను నేర్పినారు. ట్రైనింగ్ పండితున్నవారు వారు కూడా పలు అంశాలను అడిగి తెలుసుకొన్నారు. ఈ శిక్షణ పొందుతున్నవారిలో శ్రీమత ch. మానస సుధాకర్ గారి పుట్టిరోజు వేడుకలను కేక్ కట్ చేసి జరుపుకోవడం విశేషం. ఈ నాటి కార్యక్రమమునకు నూతముగా పదవీ భాద్యతలు స్వీకరించిన, శ్రీ సత్య సాయి సేవ సంస్థల, తెలంగాణ రాష్ట్ర ఉప ఆద్యక్షులు శ్రీ డాక్టర్ కృష్ణ కుమార్, ఈ సెంటర్ ను సందరించుట, అనేక రకములైన సలహాలను ఇచ్చి, త్వరలో మీ అందరికి, జారీ ( మగ్గము ) ట్రైనింగ్ కూడా ప్రారంభము కాగలదని తెలిపారు. పిల్లలకు బాలవికాస్ తరగతులు, వైద్యము, శ్రీ సత్య సాయి సంస్థలు, అందజేస్తున్నావని, వాటిని సద్వినియోగము చేసుకోవలసినదిగా సూచన చేసారు. ఈ సందర్భమును పురస్కరించుకొని శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, వందన సమర్పణ తో పాటు స్వాగత వచనాలు కూడా పలికారు.
సమితి కన్వీనర్
పి విశ్వేశ్వర శాస్త్రి
No comments:
Post a Comment