భగవాన్
శ్రీ సత్య సాయి బాబా
వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో,
శ్రీ సత్య సాయి సేవ
సంస్థలు, కోటి సమితి , హైదరాబాద్,
ఒకేషనల్ ట్రైనింగ్ టైలరింగ్ లో 9వ బ్యాచ్
లో 5-7-2018 నుండి 9-10-2018 వరకు దాదాపు 90
రోజుల శిక్షణ పూర్తి గావించిన 18 మందికి, ఒకేషనల్ ట్రైనింగ్ కవొకేషన్
ను అబిడ్స్, జి. పుల్లారెడ్డి భవనము
లో గల శ్రీ సత్య
సాయి సాయి స్టడీ సర్కిల్,
ప్రాంగణములో,9-10-2018 న 4-30 గంటలకు బాల వికాస్ విద్యార్థులు పాడిన భజనలతో ప్రారంభము
గావించబడినది. కోటి కన్వీనర్,
విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వచనములు పలుకుతూ, కోటి సమితి లో
ఇంతవరకు చేసిన పలు ఆధ్యాత్మిక,
సామాజిక సేవ కార్యక్రమాలను తెలిపూతూ, ఈ
వృత్తి విద్య శిక్షణా తరగతులలో
ఇంత వరకు
190 మందికి, శిక్షణ పొందినట్లు తెలిపారు. తదనంతరము
ఈ నాటి కార్యక్రమమునకు ముఖ్య
అతిధిగా విచ్చేసిన,శ్రీ సత్య సాయి
సేవ సంస్థల తొలి తెలంగాణ రాష్ట్ర
అధ్యక్షలు శ్రీ పి వెంకట్
రావు, ఉపాధ్యక్షులు, డాక్టర్ కె కృష్ణ కుమార్,
జ్యోతి ప్రకాశనం గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర అధ్యక్షలు, ఉపాధ్యక్షులు
శ్రీ పి వెంకట్ రావు, డాక్టర్
కె కృష్ణ కుమార్ సుశిక్షితులైన 18మందికి,
సర్టిఫికెట్స్ బహుకరణ, గావించారు.
రాష్ట్ర అధ్యక్షలు, శ్రీ పి
వెంకట్ రావు మాట్లాడుతూ,, అన్ని ప్రేమలు అసలైన ప్రేమలు కావని, భగవంతుని పై గల ప్రేమే నిజమైన ప్రేమ అని, ప్రేమ కు నిర్వచనమిస్తూ, ఎదుటి వారికీ మేలు చెయ్యి, మరచి పో, ఇవ్వు ఇచ్చిన దానిని మర్చి పో, అని చెప్తూ, స్వామి అనుగ్రహించి, సందేశమును మనము చేసికుంటూ ప్రతి వ్యక్తి, కూడా సేవ చేసే అవకాశమున్నదని, ఏదో మందిరాలు హాస్పిటల్ క కట్టుటయే సేవ కాదని, చెప్పుతూ, అన్నిటికన్నా ముఖ్యమైనది, అందరూ చేయగలడి ఎదుటి వారితో హృదయ పూర్వకముగా, మాట్లాదడమే, నిజమైన సేవ అని, స్వామి అన్న మాటలను తెలియజేసారు. ఈ
మహా పట్టణములో ఇంత మంది ఉండగా వీరే ఈ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందారంటే, ఇది కేవలం,స్వామి సంకల్పమే భవిస్తూ, ఈ శిక్షణ తరువాత కూడా కోటి సమితి సభ్యులతో, వారు చేస్తున్న సేవాలలో కూడా భాగస్థులు అయి వారితో అనుబంధము కలిగి ఉండాలని, కోటి సమితి వారిచే అనేక సేవా కార్యక్రమాలు స్వామి చేయించాలని, స్వామిని, ప్రార్ధిస్తూ,, పాల్గొన్న ప్రతి వారికీ అభినందనలు,తెలుపుతూ, వారి ప్రసంగాన్ని ముగించారు.
ఉపాధ్యక్షులు, డాక్టర్
కె కృష్ణ కుమార్, మాట్లాడుతూ,
సామాజిక, సాంసృతిక, ఆధ్యాత్మక, సేవ కార్యక్రమాలకు కోటి సమితి
ఒక పెద్ద
ఘాని గా
ఉదహరిస్తూ, వారు నిర్వహిస్తున్న వృత్తి, విద్య శిక్షణా
కార్యక్రమాలను, అభినందిస్తూ, టైలరింగ్ తో
పాటు, jardowsi ప్రారంబించే దిశగా
వారికి సూచననిచ్చారు.
కోటి సమితి
బాలవికాస్ విద్యార్థుల
భజనలను, కూడా అభినందించారు.
ఈ శిక్షణ
పొందిన 9 వ బ్యాచ్
వారి పక్షాన
శ్రీమతి పి
చంద్ర మాట్లాడుతూ,
టైలారింగ్ నేర్చుకున్న
మేమంతా, మా కాళ్ళ
పై మేము
నిలబడి, మా కుటుంబ
సంపాదనకు చేయూత
నిచ్చే విధముగా,
చేసిన, సత్య సాయి
సేవ సంస్థలు,
కోటి సమితి,
నిర్వహించిన సేవలను
కొనియాదారు.
ఈ
కార్యక్రమములో,, స్వామి పూర్వ
విద్యార్థులు, శ్రీ ఎం
ఎల్ న్
స్వామి,శ్రీ
సురేష్, మరియు ప్రకాష్, రాందాస్, సుభాష్ చవాన్,
జియా గూడా
నాగేశ్వర రావు,
శ్రీమతి ఇందిర,
శ్రీమతి విజయ
లక్ష్మి, శ్రీమతి సీతమహాలక్ష్మి,, రేణుక,, సునీత, నీలిమ, పద్మావతి, శ్రీమతి వాణి,
బాల వికాస్
విద్యార్థులు,
తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య
సాయి సేవ
సమితి, కోటి సమితి
పక్షాన, రాష్ట్రఅధ్యక్షలు ,శ్రీ వెంకట్రావు
గారిని, సమితి సభ్యులు
అందరూ కలసి,
ఒక తీపి
జ్ఞ్యాపితో
సత్కరించుకొని, ఆనంద పడ్డారు.
రాష్ట్ర అధ్యక్షలు,
ఉపాధ్యక్షులు భగవానునికి,
మంగళ హారతి
సమర్పణతో, 9వ
కానవొకేషన్ కార్యక్రమము,
ముగిసినది.
కన్వీనర్
విశ్వేశ్వర శాస్త్రి
వందన సమర్పణ
గావిస్తూ, 10 వ బ్యాచ్
టైలరింగ్ లో
శిక్షణ కొరకు,
స్థానికుల దరఖాస్తులను
కోరుతూ, ఈ నెల
15 వ తేదీ
వరుకు,
ఈ
సెల్ నెంబర్
లో 94404 09410,. 88865 09410, సంప్రదించి, పేరు నమోదు
చేసుకోవలసిందిగా కోరారు.ఫోటో
జత చేయడమైనది.
Koti Samithi Convenor,
P Visweswara Sastry,
9440409410
No comments:
Post a Comment