PL HERE TO SEE THE PHOTOs
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో, ఈ రోజు శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో స్వచ్ఛత ద్వారా దివ్యత్వమునకు అనే కార్యక్రమమునకు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, ప్రారంభించింది. ఈ రోజు మొత్తము 20 మంది ఒక గంట సేపు ఈ కార్యక్రమములో పాల్గొని, సెంటర్ ను పరిశుభ్రము గావించి, కుట్టు యంత్రములన్నిటిని, కూడా సర్వీసింగ్, మరియు మైనర్ రేపైర్స్ కూడా శ్రీ శ్రీశైలం గారి సహాయముతో, అన్నియంత్రములు సరిగ్గా పనిచేసే విధముగా ఉంచారు మన శ్రీశైలం గారు. తదనంతరము మన జాతి పిత గాంధీ గారి 150 వ జయంతిని పురస్కరించుకొని, ఆయన జీవిత ఘట్టాలను, కొన్ని స్మరించుకుంటూ, నివాళులు అర్పించడమైనది. ఈ సందర్భముగా, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు తెలిపిన, ఆగష్టు 2018 సన్తా సారథి లో స్వతంతదినోత్సవ సందర్భముగా స్వామి తెలిపిన విశేషాలను కూడా చదువుకోవడమైనది. ఈ కార్యక్రమములో, శ్రీమతి గోలి సంతోషి, కుమారి ప్రణీత, శ్రీమతి పి చంద్ర, శ్రీమతి మానస గార్లు, శ్రీమతి విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమమును శ్రీమతి ప్రమీల గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయముగా జరిపించిన స్వామికి హృదయపూర్వక నమస్కారములు తెలుపుకుంటూ అందరికి సాయిరాం. తరువాతి స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని, నయా బజార్ స్కూల్ ప్రాగణంలో, మరియు శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ లో ఈ నెల 8 వ తారీకు లోపల జరుపవలెను. సాయిరాం.
No comments:
Post a Comment