స్వామి వారి దివ్య అనుగ్రహముతో ఈ రోజు అనగా 1-1-2020 న ఉస్మాన్ గూంజ్ లో గల శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను , 13 వ బ్యాచ్ టైలరింగ్ శిక్షణ పొందుతున్న వారు, ఘనంగా జరుపుకున్నారు. కుమారి రాజనందని, కుమారి హేమ, మరియు సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి జ్యోతి ప్రకాశనము గావించి, వేద పఠనం తరువాత, కేక్ కట్ చేసి, స్వామి వారి న్యూ ఇయర్ సందేశమును సమితి కన్వీనర్ పూర్తిగా వివరించారు. తరువాత అందరికి చలికాలం లో ప్రతి సంవత్సరము లాగానే ఈ సరి కూడా, మలకుంట స్లం వారికీ, విద్యాజ్యోతి పధకం క్రింద దత్తత తీసుకున్న నయా బజార్ స్కూల్ పిల్లలకు, ఒకేషనల్ ట్రైనింగ్ టైలరింగ్ లో శిక్షణ పొందుతున్నవారికి రగ్గులు అందజేశారు.
అందరు కేక్ ప్రసాదము తీసుకున్న తరువాత కార్యక్రమము ముగిసినది.
No comments:
Post a Comment