శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్, సెంటర్, టైలోరింగ్ లో
18 వ బ్యాచ్ ప్రారంభం. 23-5-2023.
శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో 18 వ బ్యాచ్ ప్రారంభం. 23-5-2023.
మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చుటకు శ్రీ శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ( టైలరింగ్లో ) ప్రతి మూడు నెలలకు 20 మంది స్థానిక గృహిణుల, సాధికారతఃను, సాధించేందుకు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్, ఆధ్వర్యంలో, గత 7 సంవత్సరములుగా, ఉస్మాన్ గూంజ్ లో తోప్ ఖనాలో ప్రారంభమై, 17 బ్యాచ్లలో కుట్టు శిక్షణ, మరియు ఒక బ్యాచ్ వారికీ మెహందీ, బ్యూటిషన్, కోర్సులలో శిక్షణ నిచ్చారు.మూడు కుట్టు యంత్రములతో, ప్రారంభించిన ట్రైనింగ్ సెంటర్ 12 కుట్టుయంత్రములతో కొనసాగుతున్నది. 400 మంది శిక్షణ పొందినారు. అందరు ఉపయోగించు కొనుటకు వీలుగా, ముఖ్యముగా పూర్వ శిక్షకుల కోసము ఒక PICCO మిషన్ కూడా ఏర్పాటు చేయడమైనది.
ఈ శిక్షణా తరగతులు, డిసెంబర్, 5, 2015 ప్రారంభమైన విషయము విదితమే. టైలరింగ్ తో పాటు, సేవా కార్యక్రమాలలో భాగంగా, గవర్నమెంట్ మెటర్నిటీ హోమ్, సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో వారు కుట్టున బొంతలు, కుల్లాలు, లంగోటాలు వారు కుట్టేనవే వారిచే పంపిణి గావింవ జేసీ, వాటికీ తోడుగా గర్భిణీ స్త్రీలకూ ఆపిల్ పండ్లను, కూడా ఇప్పించడమైనది. దీనిలో వారు పొందిన అనుభూతి వర్ణించలేము. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రతి నెలా మహిళా దినోత్సవ వేడుకలను, మరియు, సెల్ ఫోన్ లో వాట్సాప్, పేటీమ్, లొకేషన్ షేరింగ్, గూగుల్ మప్స్, షేరింగ్, తదితర అంశాలలో అవగాహన కావించుటకు శ్రీ మురళీకృష్ణ తో ఒక అవగాహనా సదస్సును, ఏర్పాటు కావించి, వారిలో, కోరికల పై, అదుపు, అలవాటు చేసుకొనే విధముగా, మరియు, కుట్టు యంత్రములో శ్రీ శైలం గారిచే మెకానిజం తరగతులను, 50 cm స్మార్ట్ టీవీ ద్వారా అనేక కుట్టు సంబంధిత విషయాలలో అవగాహన కలిగించడమే కాకుండా వారు అనేక కార్యక్రమాలలో పాల్గొనేటట్లుగా శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ దోహదపడుతుంది.
పత్రీ బ్యాచ్లో వీరికి, Advanced Tailoring in Fashion Designing లో 25 ఐటమ్స్ తో ఒక ప్రత్యేక సిలబస్ తో పాటుగా నిక్కరును, మరియు షర్ట్ ను కూడా నేర్పాడము కూడా జరుగుతున్నది.
ఇప్పటి వరుకు శిక్షణ పొందిన వారు 50% వారి వారి గృహాలలో మరియు, వారి వారి స్వా స్థలాలలో, స్వయముగా, కుట్టు యంత్రములను ఏర్పరుచుకొని, డబ్బు సంపాదించుకొని, ఆనందపడుతున్నారు.
17 వ బ్యాచ్ లో శిక్షణ పొందిన ( 11 ) మందికి, 25-5-2023 న ఆశ్రితకల్ప సత్రం లో ప్రముఖ మరియు అంతర్జాయ సాఫ్ట్ స్కిల్ కోచ్ నిపుణులు శ్రీ జి వి ఎన్ రాజు గారు ప్రశంసా పత్రములను అందజేయనున్నారు. హైదరాబాద్ డిస్టిక్ట్ ప్రెసిడెంట్ ఏ మల్లేశ్వర రావు తదితరులు పాల్గొననున్నరని, సమితి కన్వీనర్ పి. విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు.
అవసరమున్న వారిని గుర్తించి, వారికీ చేయుత నిచ్చుటకు కుట్టు యంత్రములను కూడా బహుకరించింది శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి, హైదరాబాద్.
ఈ నాటి 18 వ బ్యాచ్ Advanced Tailoring in Fashion Designing కోర్స్ ఈ రోజు నుండి,అనగా 23-5-2023 నుండి - మూడు నెలలు లేక 100 రోజులు అంటే ఆగష్టు 30 వ తేదీవరకు 2023 వరకు కొనసాగునని, కోటి సమితి కన్వీనర్, పి. విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. ఈ బ్యాచ్ లో మొత్తము 23 మంది శిక్షణ పొందుతున్నట్లుగా వివరించారు. శ్రీమతి రేణుక గారు జ్యోతి ప్రకాశనం గావించి, వేదం, ముస్లిం మహిళలు క్కురన్ లో ని కొన్ని శ్లోకాలను పఠించించిన అనంతరం, శ్రీమతి దాసా పద్మావతి, 6 ముక్కల సారీ పెట్టి కోటు కటింగ్ డ్రాయింగ్ ద్వారా, మరియు పేపర్ కటింగ్ ద్వారా ఏంతో వివరముగా తెలియజేసారు.
ఈ చిత్రములో శిక్షణ నిస్తున్న దాసా పద్మావతి, దాస వాణి, పాటు 18 వ బ్యాచ్ శిక్షకులు.
ఫోటో జత చేయడమైనది.. సమితి కన్వీనర్,
PL CLICK HERE FOR ATTENDENCE EL SHEET
No comments:
Post a Comment