Monday, June 26, 2023

SMT VANAJA, HYDERABAD DISTRICT VIDYA JYOTHI CO-ORDINATOR. VISITS SRI SATHYA SAI SKILL DEV ( TAILORING CENTRE) 26-6-2023

 



SMT VANAJA, HYDERABAD DISTRICT VIDYA JYOTHI CO-ORDINATOR. VISITS SRI SATHYA SAI SKILL DEV 

( TAILORING CENTRE) 26-6-2023 




భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు,       26 6 2023 హైదరాబాద్ జిల్లా విద్యా జ్యోతి కోఆర్డినేటర్, శ్రీమతి వనజ గారు, ఉస్మాన్ గంజ్  తోప్ ఖానా, లో శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ టైలరింగ్ సెంటర్, ను సందర్శించి, సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి సభ్యులను కుట్టు శిక్షణ ఇస్తున్న గురువులను, శ్రీమతి పద్మావతి గారిని, మరియు శ్రీమతి వాణి గారిని, 18 వ టైలరింగ్ బ్యాచ్ లో, శిక్షణ పొందుతున్న, శిక్షకులను, అందరినీ ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్కడ ఉన్న మీరంతా, ఎంతో అదృష్టవంతులని, భగవంతుడే మిమ్మల్ని సెలెక్ట్ చేశారనిస్వామి సంస్థలలో, ఏ శిక్షణ అయినా, పొందిన వారు, ఉన్న స్థాయి నుంచి, మరి ఉన్నత స్థాయికి, చేరుకుంటారని, చేరుకోవాలని, అన్నారు. వారి స్వ అనుభవాలను కూడా, జోడించి, నేను నా 67, వయసులో, స్వామి సంస్థలో ఉన్నానని, మీరు, ఇంత చిన్న వయసులోనే, ఉన్నారని, వారిని ప్రశంసించారు. తరువాత, శిక్షకులంతా, వారు, గురువుల చెప్పే విధానం, వారి యొక్క రికార్డ్ బుక్స్, అన్నీ కూడా, ఎంతో పరిశీలించి, వారి యొక్క విలువైన, సలహాలను తెలియజేస్తూ, మీరు మీ కుటుంబంలోని వారికి, చేదోడు వాదోడుగా ఉంటూ, ఇక్కడ నేర్చుకున్న అందుకు, మీరు ఎంతో అభివృద్ధికి రావాలని, స్కిల్ అనేది, మనం ఏనాటికి మరిచిపోనిదని తెలియజేశారు. ముఖ్యంగా కోటి సమితి సభ్యులను, ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఏడు సంవత్సరాలయింది, తెలుసుకున్న తర్వాత వారికి  ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. చివరగా, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి పక్షాన, శ్రీమతి వనజ గారికి, శ్రీమతి పద్మావతి గారు, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పటమును, బహుకరించగా కార్యక్రమం ముగిసింది.

Pl click here to view the  video 


Wednesday, June 21, 2023

INTERNATIONAL YOGA DAY CELEBRATIONS AT SRI SATHYA SAI SKILL DEV TAILORING CENTRE. OSMAN GUNJ. HYD. 21-6-2023





శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ టైలరింగు శిక్షణా కేంద్రంలో, అంతర్జాతీయ యోగ దినోత్సవం
21-6-2023

అంతర్జాతీయ యోగ దినోత్సవం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పరిచయంతో అంతర్జాతీయ యోగ దినోత్సవము 2014 లో  ప్రారంభించబడినది. మన  సంయుక్త రాష్ట్రాలు 21జూన్ ని అంతర్జాతీయ యోగ దినంగా జరుపుకుంటు రావడం అందరికి తెలిసినదే  శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, ఉస్మాన్ గంజ్ లో గల శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ టైలరింగు శిక్షణా కేంద్రంలో, సబీనెకర్ పూజ సారథ్యంలో, అంతర్జాతీయ యోగ దినోత్సవం అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. యోగ అనే పదము సంస్కృతం అని, రుగ్వేదము  నుండి వచ్చినదని, అనేక విషయములో తెలుపుతూ, హస్త్రిక ప్రాణాయం తో మొదలు పెట్టి, చంద్రభేది ప్రాణాయం, యోని ఆసనం, బాలసాన ఆసనం, మరియు అనేక ఆసనంలో కార్యక్రమము కొనసాగినది.  ఈ యోగ దినోత్సవ కార్యక్రమములో, వాణి గారు, గుబ్బ లావణ్య, ముస్కాన్ బేగం, జేవీరియా చిన్ని, హుమెర తస్కీం, వి.లలిత, శాఖిల ఖాతూన్, ఆర్ కవిత, ఝాన్సీ రాణి, సబా బేగం తదితరులు పాల్గొన్నారు.