అంతర్జాతీయ యోగ దినోత్సవం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పరిచయంతో అంతర్జాతీయ యోగ దినోత్సవము 2014 లో ప్రారంభించబడినది. మన సంయుక్త రాష్ట్రాలు 21వ జూన్ ని అంతర్జాతీయ యోగ దినంగా జరుపుకుంటు రావడం అందరికి తెలిసినదే శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, ఉస్మాన్ గంజ్ లో గల శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ టైలరింగు శిక్షణా కేంద్రంలో, సబీనెకర్ పూజ సారథ్యంలో, అంతర్జాతీయ యోగ దినోత్సవం అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. యోగ అనే పదము సంస్కృతం అని, రుగ్వేదము నుండి వచ్చినదని, అనేక విషయములో తెలుపుతూ, హస్త్రిక ప్రాణాయం తో మొదలు పెట్టి, చంద్రభేది ప్రాణాయం, యోని ఆసనం, బాలసాన ఆసనం, మరియు అనేక ఆసనంలో కార్యక్రమము కొనసాగినది. ఈ యోగ దినోత్సవ కార్యక్రమములో, వాణి గారు, గుబ్బ లావణ్య, ముస్కాన్ బేగం, జేవీరియా చిన్ని, హుమెర తస్కీం, వి.లలిత, శాఖిల ఖాతూన్, ఆర్ కవిత, ఝాన్సీ రాణి, సబా బేగం తదితరులు పాల్గొన్నారు.
Aum Sri Sairam
ReplyDelete