Sunday, February 18, 2024

MAHILA DAY CELEBRATIONS. 19-2-2024 12 NOON ONWARDS.

 MAHILA DAY CELEBRATIONS. 19-2-2024 12 NOON ONWARDS


















19-2-2024

Women's Day Celebrations at Sri Sathya Sai Skill Development Center

The Women's Day program was organized by Sri Sathya Sai Seva Samithi, Koti Samithi at Sri Sathya Sai Skill Development Center with great devotion and enthusiasm.

The program began with the chanting of Sai Gayatri Mantra 11 times by all the participants. Smt. Padmavathi, Smt. Vani and Jyothi Prakasham lit the lamp to mark the inauguration of the program.

Smt. Padmavathi, Smt. Vani, Smt. Veena, Smt. Swapna, Smt. Prasanna Lakshmi, Smt. Sireesha S., Smt. Lakshmi, Smt. Kalyani, and Smt. Sri Devi spoke on the occasion and extended Women's Day greetings to all.

They spoke about the sacrifices and contributions of women like Jhansi Lakshmi Bai and Indira Gandhi.

Smt. Sri Devi, Lakshmi, Prasanna, and Susma shared their experiences with their mothers and expressed their gratitude for their love and support. They also pledged to live up to their mothers' expectations and excel in the tailoring field.

Smt. Sri Devi, who is illiterate, said that she is not ashamed of it and that she will learn tailoring to prove her critics wrong.

The program concluded with a Mangala Harathi offered to Bhagavan Sri Sathya Sai Baba.

B. Sushma deserves special appreciation for live-streaming the entire program on WhatsApp video.


19-2-2024 

ఈ నాటి మహిళా దినోత్సవ కార్యక్రమము శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో. శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఘనంగా, ఎంతో భక్తి, శ్రద్దలతో జరిగినది. సాయి గాయత్రి మంత్రాన్ని అందరు కలసి, 11 సార్లు పాటించిన అనంతరం, పద్మావతి, శ్రీమతి వాణి, జ్యోతి ప్రకాశనం గావించగా, శ్రీమతి పద్మావతి గారు, శ్రీమతి వాణి గారు, శ్రీమతి వీణా  గారు, శ్రీమతి స్వప్న గారు, శ్రీమతి ప్రసన్న లక్ష్మి గారు, శ్రీమతి శిరీష ఎస్. శ్రీమతి లక్ష్మి గారు, కల్యాణి గారు, శ్రీమతి శ్రీ దేవి గారు, అనూష గారు, అందరు  మాట్లాడుతూ, అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఝాన్సీ లక్ష్మి గారి గురించి, ఇందిరా గాంధీ గారి గురించి, మాట్లాడినారు. ముఖ్యంగా, శ్రీ దేవి, లక్షి, ప్రసన్న, సుస్మా తదితరులు, వారి వారి తల్లుల ఘనతను చెప్తూ, తల్లి యెక్క ప్రేమను, త్యాగమును, వివరించి, వారి తల్లులను దేవతగా వర్ణించుకుంటూ, ఆనందభాష్పములు, కార్చుకుంటూ, వారిని స్మరించుకుంటూ, ఆనందానికి, బాధకు లోనై, తల్లి వారి పైన ఉంచిన ఆశలకు అనుగుణముగా, ప్రవరిస్తూ, ప్రస్తుతము వారు నేర్చుకుంటున్న టైలోరింగ్ రంగములో, ముందుకు వెళ్తూ, అందరి ప్రశంశలు పొంది అందరికి మంచి పేరు తెస్తామన్నారు. ముఖ్యంగా శ్రీ దేవి మాట్లాడుతూ, తనకు చదువు రాదని, చదువు రాదని చెప్పుకొనుటకు ఏమాత్రము సిగ్గు పదాననని, నన్ను అవమానించిన వారికీ నేను టైలోరింగ్, నేర్చుకొని, వారికీ గుణపాఠము చెప్తానని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికీ శ్రీ దేవి మంగళ హారతి సమర్పణతో, కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. బి. సుష్మ తన సెల్ ఫోన్ ద్వారా కార్యక్రమాన్నంతా నాకు వాట్సాప్ ఆన్లైన్  వీడియో లో  ప్రసారం గావించిన విధానం శ్లాఘనీయం. 





1 comment:

  1. WHATSAPP MESSAGE FROM STATE SKILL DEV INCHARGE INCHARGE SRIMATI MADHAVILATHA GARU
    అందరికి ప్రేమ పూర్వకమైన sairam 🙏🏼

    మహిళా దినోత్సవం ని మీరు చాల ఉత్సాహంగా చాల బాగా చేసుకున్నారు.

    భగవంతుణ్ణి ప్రార్ధించడం తో పాటు మీరు అందరి ముందు మీ మనో భావాలను వ్యక్తం చేయడం హర్షణీయం. ఇది మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. నన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళకి గుణపాఠం చెప్తాను అనే సంకల్పం తో ముందుకు వెళుతున్న సోదరికి స్వామి ఆశీస్సులు.

    ట్రయ్నర్లు మరియు నేర్చుకునే వాళ్ళు కలిసి మెలసి చేసుకున్నారు.I am sure Swami is happy.

    May Swami bless the whole team.

    Sairam🙏🏼

    ReplyDelete