Friday, February 9, 2024

SMT MADHAVI LATHA VISITS SRI SATHYA SAI SKILL DEV CENTRE - OSMAN GUNJ, HYD. 9-2-2024




Visit of Ms. Madhavi Latha, Telangana Skill Development Incharge
Date: February 9, 2024
Time: 1 PM
Location: Koti Samithi Skill Development Center, Hyderabad

Event Details:

Ms. Madhavi Latha delivered a speech to skill development trainees.
Emphasized that everyone is unique and created by God, discouraging comparisons.
Highlighted the importance of happiness in life and urged trainees to strive for their goals.
Stressed that service reduces ego and even kind words to others are service.
Trainees shared their experiences and opinions.
Ms. Madhavi Latha offered guidance and advice to trainees.
Convener P Vishweshwar Shastri expressed gratitude to Ms. Madhavi Latha.
Trainees gifted a picture of Swami to Ms. Madhavi Latha.
A QR code for daily attendance was launched.
Key Takeaways:

Implement Swami's teachings in life.
Respect and love everyone.
Work towards achieving your goals.
Service makes us better people.
Event concluded successfully.

Sai Ram

ఈ రోజు అనగా 9-2-2024    , మధ్యాహ్నం 1    గంటకు, (మహిళ) తెలంగాణ రాష్ట్ర  స్కిల్ డెవలప్మెంట్ ఇంచార్జి  శ్రీమతి మాధవీలత గారు   మన కోటి సమితి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను సందర్సించి నారు. 

ట్రైనీస్ ఉద్దేశించి పలు అంశాలను, స్వామి వారి బోధలను, వివరించి, స్వామి వారి ప్రేమ త్వత్వం ను వివరించారు. 

ఈ కార్యక్రమములో, కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి,  కోటి సమితి ట్యూటర్, పద్మావతి, వాణి మరియు శిక్షణ పొందుతున్న 13 మంది ట్రైనీస్ పాల్గొన్నారు. 

శ్రీమతి మాధవీలత గారు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనీస్ ఉద్దేశించి, దిశా నిర్దేశం చేస్తూ, స్వామి మాటలను మననం చేసుకుంటూ ఈ విధంగా వారి ప్రసంగం కొనసాగినది. 

మనమంతా  భగవంతుడు సృష్టించిన  క్రియేషన్స్ మని,  అని అన్నారు. 

మనకు ఏమైనా డిప్రెషన్స్ ఆలోచనలు  వచ్చినప్పుడు, మనము కృంగక, భగవంతుడు  నన్ను ఏదో ఒక పనిమీది సృష్టించాడు కదా, అనుకోని, భూమ్మీదికి పంపించాడు అనుకోవాలి.  ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి అవసరం ఉన్నది సృష్టికి అందరూ అవసరమే ఒకరు ఒకరితో కంపేర్ చేయవలసిన అవసరం లేదు కానీ మనం చేస్తున్నదే  కంపారిజన్  అని అన్నారు 

ప్రతి ఒక్కరూ నాకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకుంటారు.  కాబట్టి మనం ముందు అందర్నీ రెస్పెక్ట్ చేయాలి మర్యాద ఇవ్వాలి అని అన్నారు అదేవిధంగా నన్ను అందరూ ప్రేమించాలి అన్నప్పుడు మనం కూడా అందరిని ప్రేమించడం నేర్చుకోవాలి అందరూ నాపై జాలి, కరుణ చూపాలి  అని మనం ఏ రకంగా అయితే అనుకుంటామో అదేవిధంగా మనం అందరిపైనా జాలి చూపించాలి అని అన్నారు. 

పల్లెల్లో ఉండే వారి కన్నా సిటీలో  అందులో ముఖ్యంగా కోటిలో ఉన్న మీరంతా ఎంతో అదృష్టవంతులు అన్నారు ఎందుకంటే ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ను మీరు చూస్తూ ఉంటారు ఇవన్నీ చూసినప్పుడు మనం మన జీవితాల్లో ఎంతో ముందుకు సాగాలి అనే కోరిక వస్తుంది, అని అన్నారు.  అన్నింటికన్నా ముఖ్యంగా జీవితంలో హ్యాపీనెస్ అనేదే ముఖ్యం.   మనం మన గోల్ను పెట్టుకొని ముందుకు సాగాలని అన్నారు. 

వాట్సాప్ గ్రూపులో, నేను ఈ వారంలో ఇంత అమౌంట్ సంపాదించాను, మాకు తెలిసిన వాళ్ళకి నేను ఫ్రీగా కుట్టించాను అనే వివరాలు వాట్సాప్ గ్రూప్ లో మెన్షన్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని వారు అన్నారు. 

ఇది మీకు ముందు ముందు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ కావాలంటే ఈ రకంగా చేయాలని తెలియజేశారు మనం ఎప్పుడు ధనికులను చూసి కంపేర్ చేసుకోకూడదని మనకు తెలియని విషయాన్ని అప్పటికప్పుడు సిగ్గుపడకుండా అడిగి తెలుసుకుంటే ముందుకు సాగగలమని సెలవిచ్చారు. 

భగవాన్ బాబా వారి సూక్తులలో లవ్ ఆల్ -  సర్వాల్ విషయాలన్నీ తెలియజేస్తూ సేవ మనలోని అహంకారాన్ని తగ్గిస్తుందని తెలియజేశారు.  సేవలలో మనం ఎన్నో రకాలు.  కేవలం డబ్బు సహాయం చేస్తేనే సేవ చేసినట్లు కాదని ఎదుటివారితో ముఖ్యంగా  అనారోగ్యంగా ఉన్న వారితో వారి మాటలు విని వారికి ఉపశమనాన్ని ఇచ్చే ఒక్క మాటలో సమాధానం చెప్పి వారిని సంతృప్తి పరచగలిగితే అది కూడా మంచి సేవ అని శ్రీమతి మాధవి లత గారు అనేక విషయాలు తెలియజేశారు. 

ట్రైనీస్ కొందరు, నిధి జోషి, ప్రసన్న, వీణ, తేజస్వి, తదితరులు, ఎన్నో విషయములు తెలిపిన శ్రీమతి మాధవి లత గారికి ధన్యవాదములు తెలుపుతూ, ఈ సెంటర్ ప్రతి గురువారం భజన, మరియు, శనివారం, హనుమాన్ చాలీసా, కార్యక్రమములు కన్వీనర్ సూచనల ప్రకారం కొనసాగిస్తున్నామని, తణ్డులర్చన కార్యక్రమములో పాల్గొన్నామని తెలియజేశారు. 

ముఖ్యంగా శ్రీ విద్య మాట్లాడుతో, తను, ఒక సంస్థలో 20,000 ఫీజు కట్టి, మోసపోయి నట్లు తెలిపి బోరున విలపించింది. శ్రీమతి మాధవి లత గారు, ఒక తల్లి లాగ శ్రీ విద్యను ఓదార్చి, శ్రీమతి పద్మావతి గారికి, శ్రీ విద్య పై ప్రత్యేక శ్రద్ద పెట్టి నేర్పామన్నారు. 

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటీ సమితి పక్షాన, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, శ్రీమతి మాధవి లత గారు స్వామి పూర్వ విద్యార్థిని అని, ఈ మధ్య జరిగిన శ్రీ సత్య సాయి నిగమాగం లో జరిగిన మహిళా యూత్ కార్యక్రమాల్లో వారు 1600 మహిళా యూత్ ను ఉద్దేశించి, ప్రసంగించారని, ఎంతోమంది ప్రశంసలు అందుకున్నారని, అంతటి వారు, ఈరోజు ఉదయం నుంచి, స్వామి కార్యక్రమంలో, పాల్గొంటూ,  అలుపు లేకుండా, మన సెంటర్ ను సందర్శించడం, నిజంగా, స్వామి సంకల్పంగా భావిస్తూ,  మాధవి లత గారికి, స్కిల్ డెవలప్మెంట్, ట్రీనిస్, తరఫున మరియు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి తరపున హృదయపూర్వకమైన, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనీస్,  అంతా కలిసి, కోటి సమితి పక్షాన, స్వామి వారి ప్రేమను, ఈ మధ్యనే అంటే, జనవరి 22వ తేదీన అయోధ్యలో, ప్రాణ ప్రతిష్ట గావించిన, బాల రాముడి, చిత్రపటాన్ని బహూకరించారు. తదనంతరం, డైలీ అటెండెన్స్, కోసం రూపొందించిన, ఒక క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించిన స్వామికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సభా కార్యక్రమాన్ని ముగిసినట్లుగా తెలిపారు.  సాయిరాం















No comments:

Post a Comment