Tuesday, November 28, 2017

7TH BATCH VOCATIONAL TRAINING (TAILORING) 5-12-2017 FOR 3 MONTHS 90 DAYS

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు,
కోటి సమితి, హైదరాబాద్
7 బ్యాచ్ ఉచిత  టైలరింగ్ శిక్షణ డిసెంబర్ 5, 2017 ప్రారంభం

డిసెంబర్ 5, 2017   నుండి శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్వర్యములో ఉస్మాన్ గంజ్ తోప్  ఖానా లో గల శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో ఉచిత  టైలరింగ్ శిక్షణ నివ్వనున్నట్లు   
శ్రీ సత్య సాయి సేవ సంస్థల కోటి సమితి,కన్వీనర్ పి. విశ్వేశ్వర శాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు.  గోషామహల్ నియోజక వర్గములోని నిరుపేద మహిళలు, శిక్షణకు అర్హులని తెలిపారు.  వారు వారి ఆధార్ కార్డు కాపీ ను  మరియు (2) పాస్ పోర్ట్ సైజు ఫోటాస్ తీసుకొని వచ్చి పేరు నమోదు చేసుకోగలరు. ఆసక్తి గలవారు 88865 09410 మరియు 94404 09410 కి ఫోన్ చేసి కూడా పేరు నమోదు చేసికొనవచ్చును. పేరు నమోదు చేసి కొనుటకు ఆఖరి తేదీ 1-12-2017
కన్వీనర్ :
పి. విశేశ్వర శాస్త్రి

 



Sunday, November 26, 2017

COMPLETION OF 2 YEARS VOCATIONAL TRAINING CENTRE.

శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కి 2 సంవత్సరములు.
మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చేఎందుకు ఏర్పడిన శ్రీ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ( టైలరింగ్ ) 2 సంవత్సరములు పూర్తిచేసుకున్నది. గృహిణులు, సాధికారతఃను, సాధించేందుకు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్, ఆద్యర్యంములో, 2 సంవత్సరముల క్రింద ఉస్మాన్ గూంజ్ లో గల తోప్ ఖనా లో ప్రారంభమై, 6 బ్యాచేలలో కుట్టు శిక్షణ, మరియు ఒక బ్యాట్ వారికీ మెహందీ, బ్యూటిషన్, కోర్సులలో శిక్షణ నిచ్చారు. ఈ శిక్షణా తరగతులు, డిసెంబర్, 5, 2015 ప్రారంభమై, మార్చ్, 2016 న పూర్తి అయినది. ఏప్రిల్ 2016 మాసంలో 2 బ్యాచ్ ప్రారంభమై, జూన్ 16 లో పూర్తియైనది. 3 వ బ్యాచ్ జూన్ 2016 లో పూర్తియినది. 4 వ బ్యాచ్ అక్టోబర్, 2016 ప్రారంభమై జనవరి 2017 లో పూర్తియినది. 5 బ్యాచ్ మార్చ్ 2, 2017 న ప్రారంభమై 90 రోజులు శిక్షణ పూర్తి చేసుకొని, జూన్ 2017 న మొగిసినది. 6 వ బ్యాచ్ అగస్ట్ 20న ప్రారంభమై 20, నవంబర్, 2017 న ముగిసినది. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి , హైదరాబాద్, ఒకేషనల్ ట్రైనింగ్ లో టైలరింగ్ లో 6వ బ్యాచ్ లో 20-8-2017 నుండి 20-11-2017 వరకు దాదాపు  90 రోజుల శిక్షణ పూర్తిగావించిన 15 మందికి, ఒకేషనల్ ట్రైనింగ్ కవొకేషన్ కార్యక్రమునకు, ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ మరియు, బండారు దత్తాత్రేయ గారు 92వ శ్రీ సత్య సాయి బాబా వారి జన్మ దినోత్సవ వేడుకలలో భాగంగా, 20-11-2017 న సేవాదళ్ డే ను పురస్కరించుకొని జరుపుకొంటున్న వేడుకలో భగవానుడు నడయాడిన శివమ్ మందిర ప్రాగణం నందు సర్టిఫికెట్స్ ప్రదానం గావించారు.

గతంలో, 5 వ బ్యాచ్ వారికి, సత్య సాయి సేవ సంస్థల రాష్ట్ర అధ్యక్షులు, S.G. CHALLAM, మరియు, 4 వ బ్యాచ్ కవొకేషన్ లో PROFESSOR KAMARAJ ANIL KUMAR, చేతుల మీదుగా, సర్టిఫికెట్స్ బహుకరణ గావించారు. కుట్టు శిక్షణ తో పాటు, భజన ట్రైనింగ్, మరియు అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ముఖఃముగా తెలుపవలసిన విషయము, దాస పద్మావతి గారు, 3 వ బ్యాచ్ లో శిక్షణ పొంది, 4 వ బ్యాచ్ నుండి వారు అందరికి శిక్షణ నివ్వటము ఏంతో గర్వించదగ్గ విషయము. అవసరమున్న వారిని గుర్తించి, వారికీ చేయుట నిచ్చుటకు కుట్టు యంత్రములను కూడా బహుకరించింది శ్రీ సత్య సాయి సేవ సంస్థ కోటి సమితి, హైదరాబాద్.

7 వ బ్యాచ్ డిసెంబర్, 2017, 5వ తేదీన న ప్రారంభించనున్నట్లు, ఆసక్తి గల స్థానికులు, అంటే గోషామహల్, అబిడ్స్, ఆఫ్జాల్ గూంజ్, ఉస్మాన్ గంజ్, చుట్ట ప్రక్కల నుండు వారు ఈ సదవకాసమును వినియోగించుకోవలసినదిగా సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు.

విశ్వేశ్వర శాస్త్రి పొనుగుపాటి.










Saturday, November 25, 2017

6th Batch Convocation Vocational Training convocation. 20-11-2017 By Prof. Kamarajau Anil Kumar.



భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి , హైదరాబాద్, ఒకేషనల్ ట్రైనింగ్ లో టైలరింగ్ లో 6వ బ్యాచ్ లో 20-8-2017 నుండి 20-11-2017 వరకు దాదాపు  90 రోజుల శిక్షణ పూర్తిగావించిన 15 మందికి, ఒకేషనల్ ట్రైనింగ్ కవొకేషన్ కార్యక్రమునకు, ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ మరియు, బండారు దత్తాత్రేయ గారు 92వ శ్రీ సత్య సాయి బాబా వారి జన్మ దినోత్సవ వేడుకలలో భాగంగా, 20-11-2017 న సేవాదళ్ డే ను పురస్కరించుకొని జరుపుకొంటున్న వేడుకలో భగవానుడు నడయాడిన శివమ్ మందిర ప్రాగణం నందు సర్టిఫికెట్స్ ప్రదానం గావించారు.

ఫొటోస్ చూచుటకు క్రింద నున్న లింక్ ను నొక్కండి.

photos link.

 photos link 

 Video link.