With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba and with the co-operation of you all we have completed 12 batches... The 13th Batch will commence from 3-10-2019... Few Seats are yet to filled up.. The admission is only for the Local Area Mahilas who are economically backward.. Please inform and send them to the Centre or ask them to call the above numbers., They have to submit two passport size photos., and Adharcard Zerox copy... along with application.
Monday, September 23, 2019
Training for stiching Nikker, and Shirt - by Master Pentaiah.
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో, అనుకున్న ప్రకారం, 23-9-2019 నుండి, 12 వ బ్యాచ్ లో కుట్టు శిక్షణ పొందిన వారికీ, పూర్వ బ్యాచ్ల వారికీ అనౌన్స్ చేసినాము. కొంతమంది మాత్రము ఈ సువర్ణ అవకాశమును వినియోగించుకున్నారు. ముఖ్యముగా శ్రీమతి పద్మావతి గారు ఈ అవకాశమును వినియోగించుకున్నారు.
మళ్ళీ అందరికి శుక్రవారం అనగా, 27 వ తేదీన ఈ ప్రత్యేక తరగతి తీసుకొన బడును.
అందరు ఆ అవకాశమును వినియోగించుకో ప్రార్ధన. తెలియని వారికి తెలుప ప్రార్ధన.
సమితి కన్వీనర్. విశ్వేశ్వర శాస్త్రి
Saturday, September 21, 2019
12th Batch Convocation Report & Photos 21-9-2019 & Press Clippings dt 23-9-2019
VOCATIONAL
CONVOCATION REPORT DT 22-9-2019
ఓం
శ్రీ సాయిరాం, భగవాన్
శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈరోజు, అనగా 21 9 2019 న, ఆబిడ్స్, లో
గల, జి
పుల్లారెడ్డి భవనం, 6 వ
అంతస్తు, శ్రీ
సత్యసాయి స్టడీ సర్కిల్ ఈ ప్రాంగణంలో, ఒకేషనల్ ట్రైనింగ్
కాన్వకేషన్, 12 బ్యాచ్.
లో కుట్టు శిక్షణ
పొందిన వారికి, సర్టిఫికెట్స్
బహుకరణ కార్యక్రమాన్ని, 15
9 2019 న, ఉచిత కంటి వైద్య శిబిరంలో నిర్ధారించిన, 69 మందికి, కళ్ళజోళ్ళ
వితరణ, మరియు, కార్యక్రమంలో
హాజరైన ప్రతి
ఒక్కరికి, డెంగ్యూ
వ్యాధి నివారణకు సంబంధించిన, హోమియో మందు, వితరణ
కార్యక్రమాన్ని, ఎంతో
భక్తి శ్రద్ధలతో, శ్రీ
సత్యసాయి సేవా సంస్థలు, కోటి
సమితి, ఆధ్వర్యంలో
నిర్వహించారు.
కాన్వకేషన్
లో సర్టిఫికెట్స్ బహుమతి ప్రధానం, చేయుటకు గాను, ప్రపంచ
ప్రఖ్యాతి గాంచిన, బర్క్లీ
స్కూల్ ఆఫ్ లా, యూనివర్సిటీ
ఆఫ్ కాలిఫోర్నియా, లో
పట్టభద్రులై, మీడియా
స్పీకర్గా అకడమిక్ రైటర్గా గా
నున్న, శ్రీమతి
కృతిక వాసిరెడ్డి,LLM గారి
చేతుల మీదుగా, 12 వ
బ్యాచ్లో, శిక్షణ
పొందిన, వారికీ సర్టిఫికెట్స్
ను, బహుమతి
ప్రధానం భావించబడింది, ముఖ్యఅతిథిగా
విచ్చేసిన శ్రీమతి
కృతిక వాసిరెడ్డి గారు మాట్లాడుతూ, మహిళల
కోసం, శ్రీ
సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి వారు, చేస్తున్న
సేవలను కొనియాడుతూ, ఇలా
అన్నారు,
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 94వ జన్మ దినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోఠి సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రం 12వ బ్యాచ్ సమాపన మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీమతి కృతిక వాసిరెడ్డి తరగతులు ముగించుకున్న మహిళలనుద్దేశించి ఎంతో ఉత్తేజభరితంగా, స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. క్యాలిఫోనియా విశ్వవిద్యాలయంలోని బర్కిలీ స్కూల్ ఆఫ్ లా లో LLM చేసి, మీడియా ఉపన్యాసకురాలిగా, అకడమిక్ రచయితగా ఉన్న ఆమె మాట్లాడుతూ మహిళలు పురుషులకన్నా ఏ మాత్రం తీసిపోరు. రాతి యుగంలో అవసరార్ధం వచ్చిన శ్రమ విభజన స్త్రీలు ఇంట్లో ఉండి పనులు చేసుకునేట్టు, పిల్లల్ని సాకేట్టు, పురుషులు దూరాభారాలు వెళ్ళి పనులు చేసి సంపాదించేట్టు ఒక కట్టుబాటు వచ్చింది. ఈ రోజుల్లొ అది ఎంత దూరం వచ్చిందంటే వస్త్ర ధారణ దగ్గరనుంచి ప్రతి విషయంలోను మహిళల మీద ఆంక్షలు విధించే స్థాయికి వచ్చింది. శ్రమ విభజన ఒక అవసరంగా మొదలై, శ్రమ అంతా ఇప్పుడు మహిళలే చెయ్యాలన్న స్థాయికి వచ్చింది. ఇప్పుడు మహిళలు కూడా అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలన్న ఆలోచన రావడమే మీ జీవితానికో కొత్త మలుపు. మీ సరికొత్త జీవితానికి నాంది. జీవనోపాధికోసం ఒక పని చేస్తే శారీరికంగా, మానసికంగా ఖూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కేవలం ఇంట్లో ఉండటం వలన, రోజంతా ఖాళీగా ఉండటం వలన ప్రతికూల ఆలోచనలు ఎక్కువై అనారోగ్యం పాలవుతాం. పనులంటే ఉన్నత చదువులు చదివి చేసేది మాత్రమే కాదు; మన స్థాయికి, చదువుకి తగినట్టు ఏ పని చేసినా తక్కువేమీ కాదు. పనియే దైవం అని ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చెయ్యాలి. మీరు నేర్చుకున్న టైలరింగ్ తోనే ఎంతో ఉన్నత స్థానానికి చేరుకునే ప్రయత్నం చెయ్యండి. మనందరికీ ఇది ఒక ప్రత్యేకమైన రోజు. నా చదువు కూడా అయిపోయింది. నా ఉద్యోగ జీవితం, నా పని ప్రారంభించడానికి నేను కూడా సిద్ధమవుతున్నాను. అందుకే నాకెంతో సంతోషంగా ఉంది. సమాజం అంటే మనమే. ముందు మార్పు మనలో రావాలి. మిమ్మల్ని వేలెత్తి చూపించే సమాజమే మిమ్మల్ని ఆదర్శంగా అందరికీ చూపిస్తుంది. దేవుడు మనకిచ్చిన జీవితంలో మన పరిధిలో మన పని మనం చేస్తే చాలు. అదే దేవుడు మనకిచ్చిన అద్భుతమైన అవకాశం. ఈ అవకాశం నాకిచ్చిన శాస్త్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవుడు మనకు అన్నీ ఇచ్చేస్తే మనలో ఏదైనా సాధించాలనే కసి రాదు. నువ్వు చాలా దురదృష్టవంతురాలివి అంటుంటారు వారి నాన్నగారు అన్నారు.. మీరెంతో అదృష్టవంతులు. మీలో ఆ కసి రేకెత్తి అద్భుతమైన జీవితాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలతో వారి ప్రసంగాన్ని ముగించారు.
ఈ
కార్యక్రమంలో మొదలుగా, వందేమాతరం, వేదము, 12వ బ్యాచ్లో శిక్షణ పొందిన మహిళలచే కురాన్ లోని, కొన్ని శ్లోకాలను చదివిన అనంతరం, శ్రీమతి కృతిక వాసిరెడ్డి
గారు, ప్రముఖ కంటి డాక్టర్ ఆదిత్య
గారు., ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ జి
దుర్గాప్రసాదరావు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల
రాష్ట్ర ఉపాధ్యక్షులు, డాక్టర్ కే కృష్ణ కుమార్
గారు, కోటి
సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి జ్యోతి ప్రకాశం గావించారు.హోమియో
డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల
నుంచి ఒంటి గంట వరకు, అవసరమున్నవారు
ఉస్మాన్ గంజ్ లో గల సత్య సాయి వోకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో , ఉచిత
హోమియో చికిత్స మరియు మందులు తీసుకొని రాగలరని ఇక్కడున్న వారికి తెలిపారు,ఈనాటి
కార్యక్రమ ప్రముఖులు, అందరూ
కలిసి, ముందుగా
నిర్ధారించిన 69 మందికి, కళ్ళజోళ్ళ
ను, బహుకరించారు,డాక్టర్
జి దుర్గా ప్రసాద్ రావు గారు, డెంగ్యూ వ్యాధి
నివారణకై హోమియో మందును , పాల్గొన్న
ప్రతి ఒక్కరికి, హోమియో
మందును బహుకరించి, వేసుకోవలసిన
విధానాన్ని సూచించారు. దీని
కన్నా ముందుగా, శ్రీమతి
జి చిద్రూపిని, షగుప్తా, tabassum, తదితరులు, ఒకేషనల్
ట్రైనింగ్ సెంటర్లో ఈ మూడు నెలలలో, వారు నేర్చుకున్న, అనేక
విషయాలను, పాల్గొన్న
అనేక సేవా కార్యక్రమాలను, తెలియజేస్తూ, భగవాన్
శ్రీ సత్య సాయి బాబా వారికి, నేర్పిన గురువులకు, సమితి
కన్వీనర్ కు, కృతజ్ఞతా
పూర్వకంగా, వారి
ప్రసంగాలను, కొనసాగించారు,కుమారి
శిరీష, మనీషా, మరియు
అందరూ, వారు
కుట్టు శిక్షణ లో తయారు చేసుకున్న రికార్డ్స్‌ను, వారు
స్వయంగా కుట్టిన, పలు
గార్మెంట్స్ ని, ముఖ్య
అతిథి గారికి చూపించారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన, కృతిక వాసిరెడ్డి గారికి, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి, పక్షాన, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి ఒక జ్ఞాపికతో
ఘనంగా సత్కరించారు,సమితి
కన్వీనర్, పి
విశ్వేశ్వర శాస్త్రి, వారి
వందన సమర్పణ లో, ఈ 12 లో
నిన్నటి వరకు, శిక్షణ
పొందిన వారికి, పూర్వ
బ్యాచ్ల లో
శిక్షణ పొందిన వారికి, అందరికీ
కూడా, 23వ
తేదీ నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు , ప్రముఖ
ట్రైనర్,( టైలారింగ్) శ్రీ
పెంటయ్య గారు షర్ట్ మరియు
నిక్కర్, కుట్టటానికి, కత్తిరించడానికి, తగిన
శిక్షణ ఇచ్చే విధంగా, ప్రణాళిక
సిద్ధమైనట్లు, అందరూ, 23 వ
తేదీ నుండి ఈ సదవకాశాన్ని, వినియోగించుకోవాల్సినదిగా, కోరారు. చివరగా వందన సమర్పణ లో
భాగంగా, 13వ బ్యాచ్, ఒకేషనల్ ట్రైనింగ్, టైలరింగ్ శిక్షణ లో, స్థానికుల నుండి, అప్లికేషన్స్ చివరి తేదీ 1-10-2019
గా తెలిపారు. వారు వారి పేర్లను 88865 09410 ఫోన్ చేసి, రిజిస్టర్ చేసుకోవలసిందిగా, కోరారు. 13 బ్యాచ్ తరగతులు,
3 అక్టోబర్ నుండి ప్రారంభం కానున్నట్లు గా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, శ్రీమతి శ్రీ శారద సుప్రియ, కుమారి ఆశ్రిత, శ్రీమతి విజయ లక్ష్మి, కుట్టు శిక్షణలో పూర్వ విద్యార్థులు, కళ్ళజోడు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారుఈ
నాటి 12వ
బ్యాచ్ కవొకేషన్ కార్యక్రమము, శ్రీమతి కృతిక వాసిరెడ్డి, స్వామి
వారికీ మంగళ హారతి సమర్పణతో, దిగ్విజయముగా ముగిసినది.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 94వ జన్మ దినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోఠి సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రం 12వ బ్యాచ్ సమాపన మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీమతి కృతిక వాసిరెడ్డి తరగతులు ముగించుకున్న మహిళలనుద్దేశించి ఎంతో ఉత్తేజభరితంగా, స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. క్యాలిఫోనియా విశ్వవిద్యాలయంలోని బర్కిలీ స్కూల్ ఆఫ్ లా లో LLM చేసి, మీడియా ఉపన్యాసకురాలిగా, అకడమిక్ రచయితగా ఉన్న ఆమె మాట్లాడుతూ మహిళలు పురుషులకన్నా ఏ మాత్రం తీసిపోరు. రాతి యుగంలో అవసరార్ధం వచ్చిన శ్రమ విభజన స్త్రీలు ఇంట్లో ఉండి పనులు చేసుకునేట్టు, పిల్లల్ని సాకేట్టు, పురుషులు దూరాభారాలు వెళ్ళి పనులు చేసి సంపాదించేట్టు ఒక కట్టుబాటు వచ్చింది. ఈ రోజుల్లొ అది ఎంత దూరం వచ్చిందంటే వస్త్ర ధారణ దగ్గరనుంచి ప్రతి విషయంలోను మహిళల మీద ఆంక్షలు విధించే స్థాయికి వచ్చింది. శ్రమ విభజన ఒక అవసరంగా మొదలై, శ్రమ అంతా ఇప్పుడు మహిళలే చెయ్యాలన్న స్థాయికి వచ్చింది. ఇప్పుడు మహిళలు కూడా అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలన్న ఆలోచన రావడమే మీ జీవితానికో కొత్త మలుపు. మీ సరికొత్త జీవితానికి నాంది. జీవనోపాధికోసం ఒక పని చేస్తే శారీరికంగా, మానసికంగా ఖూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కేవలం ఇంట్లో ఉండటం వలన, రోజంతా ఖాళీగా ఉండటం వలన ప్రతికూల ఆలోచనలు ఎక్కువై అనారోగ్యం పాలవుతాం. పనులంటే ఉన్నత చదువులు చదివి చేసేది మాత్రమే కాదు; మన స్థాయికి, చదువుకి తగినట్టు ఏ పని చేసినా తక్కువేమీ కాదు. పనియే దైవం అని ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చెయ్యాలి. మీరు నేర్చుకున్న టైలరింగ్ తోనే ఎంతో ఉన్నత స్థానానికి చేరుకునే ప్రయత్నం చెయ్యండి. మనందరికీ ఇది ఒక ప్రత్యేకమైన రోజు. నా చదువు కూడా అయిపోయింది. నా ఉద్యోగ జీవితం, నా పని ప్రారంభించడానికి నేను కూడా సిద్ధమవుతున్నాను. అందుకే నాకెంతో సంతోషంగా ఉంది. సమాజం అంటే మనమే. ముందు మార్పు మనలో రావాలి. మిమ్మల్ని వేలెత్తి చూపించే సమాజమే మిమ్మల్ని ఆదర్శంగా అందరికీ చూపిస్తుంది. దేవుడు మనకిచ్చిన జీవితంలో మన పరిధిలో మన పని మనం చేస్తే చాలు. అదే దేవుడు మనకిచ్చిన అద్భుతమైన అవకాశం. ఈ అవకాశం నాకిచ్చిన శాస్త్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవుడు మనకు అన్నీ ఇచ్చేస్తే మనలో ఏదైనా సాధించాలనే కసి రాదు. నువ్వు చాలా దురదృష్టవంతురాలివి అంటుంటారు వారి నాన్నగారు అన్నారు.. మీరెంతో అదృష్టవంతులు. మీలో ఆ కసి రేకెత్తి అద్భుతమైన జీవితాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలతో వారి ప్రసంగాన్ని ముగించారు.
Subscribe to:
Posts (Atom)