Saturday, September 21, 2019

12th Batch Convocation Report & Photos 21-9-2019 & Press Clippings dt 23-9-2019























VOCATIONAL CONVOCATION REPORT DT 22-9-2019
ఓం శ్రీ సాయిరాంభగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతోఈరోజుఅనగా 21 9 2019 ఆబిడ్స్లో గలజి పుల్లారెడ్డి భవనం, 6 వ అంతస్తుశ్రీ సత్యసాయి స్టడీ సర్కిల్ ఈ ప్రాంగణంలోఒకేషనల్ ట్రైనింగ్ కాన్వకేషన్, 12 బ్యాచ్. లో కుట్టు శిక్షణ పొందిన వారికిసర్టిఫికెట్స్ బహుకరణ కార్యక్రమాన్ని, 15 9 2019 ఉచిత కంటి వైద్య శిబిరంలో నిర్ధారించిన, 69 మందికికళ్ళజోళ్ళ వితరణమరియుకార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికిడెంగ్యూ వ్యాధి నివారణకు సంబంధించినహోమియో మందువితరణ కార్యక్రమాన్నిఎంతో భక్తి శ్రద్ధలతోశ్రీ సత్యసాయి సేవా సంస్థలుకోటి సమితిఆధ్వర్యంలో నిర్వహించారు.
కాన్వకేషన్ లో సర్టిఫికెట్స్ బహుమతి ప్రధానంచేయుటకు గానుప్రపంచ ప్రఖ్యాతి గాంచినబర్క్లీ స్కూల్ ఆఫ్ లాయూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పట్టభద్రులైమీడియా స్పీకర్గా  అకడమిక్  రైటర్గా  గా నున్నశ్రీమతి కృతిక వాసిరెడ్డి,LLM  గారి చేతుల మీదుగా, 12 వ బ్యాచ్లోశిక్షణ పొందిన, వారికీ సర్టిఫికెట్స్ నుబహుమతి ప్రధానం భావించబడిందిముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీమతి కృతిక వాసిరెడ్డి  గారు మాట్లాడుతూమహిళల కోసంశ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి  సమితి వారుచేస్తున్న సేవలను కొనియాడుతూఇలా అన్నారు


భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 94 జన్మ దినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలుకోఠి సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రం 12 బ్యాచ్ సమాపన మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీమతి కృతిక వాసిరెడ్డి తరగతులు ముగించుకున్న మహిళలనుద్దేశించి  ఎంతో ఉత్తేజభరితంగాస్ఫూర్తిదాయకంగా ప్రసంగించారుక్యాలిఫోనియా విశ్వవిద్యాలయంలోని బర్కిలీ స్కూల్ ఆఫ్ లా లో LLM  చేసిమీడియా ఉపన్యాసకురాలిగాఅకడమిక్ రచయితగా ఉన్న ఆమె మాట్లాడుతూ     మహిళలు  పురుషులకన్నా  మాత్రం తీసిపోరురాతి యుగంలో అవసరార్ధం వచ్చిన శ్రమ విభజన స్త్రీలు ఇంట్లో ఉండి పనులు చేసుకునేట్టుపిల్లల్ని సాకేట్టుపురుషులు దూరాభారాలు వెళ్ళి పనులు చేసి సంపాదించేట్టు  ఒక కట్టుబాటు వచ్చింది రోజుల్లొ అది ఎంత దూరం వచ్చిందంటే వస్త్ర ధారణ దగ్గరనుంచి ప్రతి విషయంలోను మహిళల మీద ఆంక్షలు విధించే స్థాయికి వచ్చిందిశ్రమ విభజన ఒక అవసరంగా మొదలైశ్రమ అంతా ఇప్పుడు మహిళలే చెయ్యాలన్న స్థాయికి వచ్చిందిఇప్పుడు మహిళలు కూడా అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్నారుమీ కాళ్ళ మీద మీరు నిలబడాలన్న ఆలోచన రావడమే మీ జీవితానికో కొత్త మలుపుమీ సరికొత్త జీవితానికి నాందిజీవనోపాధికోసం ఒక పని చేస్తే శారీరికంగామానసికంగా ఖూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారుకేవలం ఇంట్లో ఉండటం వలనరోజంతా ఖాళీగా ఉండటం వలన ప్రతికూల ఆలోచనలు ఎక్కువై అనారోగ్యం పాలవుతాంపనులంటే ఉన్నత చదువులు చదివి చేసేది మాత్రమే కాదుమన స్థాయికిచదువుకి తగినట్టు  పని చేసినా తక్కువేమీ కాదుపనియే దైవం అని ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చెయ్యాలిమీరు నేర్చుకున్న టైలరింగ్ తోనే ఎంతో ఉన్నత స్థానానికి చేరుకునే ప్రయత్నం చెయ్యండిమనందరికీ ఇది ఒక ప్రత్యేకమైన రోజునా చదువు కూడా అయిపోయిందినా ఉద్యోగ జీవితంనా పని ప్రారంభించడానికి నేను కూడా సిద్ధమవుతున్నానుఅందుకే నాకెంతో సంతోషంగా ఉందిసమాజం అంటే మనమేముందు మార్పు మనలో రావాలిమిమ్మల్ని వేలెత్తి చూపించే సమాజమే మిమ్మల్ని ఆదర్శంగా అందరికీ చూపిస్తుందిదేవుడు మనకిచ్చిన జీవితంలో మన పరిధిలో మన పని మనం చేస్తే చాలుఅదే దేవుడు మనకిచ్చిన అద్భుతమైన అవకాశం అవకాశం నాకిచ్చిన శాస్త్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలుదేవుడు మనకు అన్నీ ఇచ్చేస్తే మనలో ఏదైనా సాధించాలనే కసి రాదునువ్వు చాలా దురదృష్టవంతురాలివి అంటుంటారు వారి నాన్నగారు అన్నారు..  మీరెంతో అదృష్టవంతులుమీలో  కసి రేకెత్తి అద్భుతమైన జీవితాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలతో వారి ప్రసంగాన్ని ముగించారు. 


      ఈ కార్యక్రమంలో మొదలుగా, వందేమాతరం,  వేదము, 12వ బ్యాచ్లో  శిక్షణ పొందిన  మహిళలచే కురాన్ లోనికొన్ని శ్లోకాలను   చదివిన అనంతరంశ్రీమతి కృతిక వాసిరెడ్డి గారుప్రముఖ కంటి డాక్టర్ ఆదిత్య గారు.ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ జి దుర్గాప్రసాదరావుశ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర ఉపాధ్యక్షులు,  డాక్టర్ కే కృష్ణ కుమార్ గారుకోటి సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి జ్యోతి ప్రకాశం గావించారు.హోమియో డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకుఅవసరమున్నవారు ఉస్మాన్ గంజ్ లో గల సత్య సాయి వోకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో , ఉచిత హోమియో చికిత్స మరియు మందులు తీసుకొని రాగలరని ఇక్కడున్న వారికి తెలిపారు,ఈనాటి కార్యక్రమ ప్రముఖులుఅందరూ కలిసిముందుగా నిర్ధారించిన 69 మందికికళ్ళజోళ్ళ నుబహుకరించారు,డాక్టర్ జి దుర్గా ప్రసాద్ రావు గారుడెంగ్యూ  వ్యాధి నివారణకై హోమియో మందును , పాల్గొన్న ప్రతి  ఒక్కరికిహోమియో మందును బహుకరించి, వేసుకోవలసిన విధానాన్ని సూచించారు. దీని కన్నా ముందుగాశ్రీమతి జి చిద్రూపినిషగుప్తా, tabassum, తదితరులుఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో ఈ మూడు నెలలలోవారు నేర్చుకున్నఅనేక విషయాలనుపాల్గొన్న అనేక సేవా కార్యక్రమాలనుతెలియజేస్తూభగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికినేర్పిన గురువులకుసమితి కన్వీనర్ కుకృతజ్ఞతా పూర్వకంగావారి ప్రసంగాలనుకొనసాగించారు,కుమారి శిరీషమనీషామరియు అందరూవారు కుట్టు శిక్షణ లో తయారు చేసుకున్న రికార్డ్స్నువారు స్వయంగా కుట్టినపలు గార్మెంట్స్ నిముఖ్య అతిథి గారికి చూపించారు.ముఖ్యఅతిథిగా విచ్చేసినకృతిక వాసిరెడ్డి గారికిశ్రీ సత్యసాయి సేవా సంస్థలుకోటి సమితిపక్షానకన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి ఒక జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు,సమితి కన్వీనర్పి విశ్వేశ్వర శాస్త్రివారి వందన సమర్పణ లో12 లో నిన్నటి వరకుశిక్షణ పొందిన వారికిపూర్వ బ్యాచ్ల లో శిక్షణ పొందిన వారికిఅందరికీ కూడా, 23వ తేదీ నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు , ప్రముఖ ట్రైనర్,( టైలారింగ్)   శ్రీ పెంటయ్య గారు షర్ట్  మరియు నిక్కర్కుట్టటానికికత్తిరించడానికితగిన శిక్షణ ఇచ్చే విధంగాప్రణాళిక సిద్ధమైనట్లుఅందరూ, 23 వ తేదీ నుండి ఈ సదవకాశాన్నివినియోగించుకోవాల్సినదిగాకోరారు. చివరగా వందన సమర్పణ లో భాగంగా, 13వ బ్యాచ్ఒకేషనల్ ట్రైనింగ్టైలరింగ్ శిక్షణ లోస్థానికుల నుండిఅప్లికేషన్స్  చివరి తేదీ 1-10-2019 గా తెలిపారు. వారు వారి పేర్లను 88865 09410 ఫోన్ చేసి, రిజిస్టర్ చేసుకోవలసిందిగా, కోరారు.  13 బ్యాచ్  తరగతులు, 3 అక్టోబర్ నుండి ప్రారంభం కానున్నట్లు గా తెలియజేశారు. ఈ కార్యక్రమంలోశ్రీమతి శ్రీ శారద సుప్రియకుమారి ఆశ్రితశ్రీమతి విజయ లక్ష్మికుట్టు శిక్షణలో  పూర్వ విద్యార్థులుకళ్ళజోడు లబ్ధిదారులుతదితరులు పాల్గొన్నారుఈ నాటి 12వ బ్యాచ్ కవొకేషన్ కార్యక్రమముశ్రీమతి కృతిక వాసిరెడ్డి, స్వామి వారికీ మంగళ హారతి సమర్పణతో, దిగ్విజయముగా ముగిసినది. 






No comments:

Post a Comment