శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో 14 వ బ్యాచ్ ప్రారంభం. 5-12-2021
మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చుటకు ఏర్పడిన శ్రీ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ( టైలరింగ్లో ) ప్రతి మూడు నెలలకు 20 మంది స్థానిక గృహిణుల, సాధికారతఃను, సాధించేందుకు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్, ఆధ్వర్యంలో, గత 6 సంవత్సరములుగా, ఉస్మాన్ గూంజ్ లో తోప్ ఖనాలో ప్రారంభమై, 13 బ్యాచ్లలో కుట్టు శిక్షణ, మరియు ఒక బ్యాచ్ వారికీ మెహందీ, బ్యూటిషన్, కోర్సులలో శిక్షణ నిచ్చారు.మూడు కుట్టు యంత్రములతో, ప్రారంభించిన శ్రీ సత్య సాయి వొకటినల్ ట్రైనింగ్ సెంటర్ 10 కుట్టుయంత్రములతో కొనసాగుతున్నది. 240 మంది శిక్షణ పొందినారు. అందరు ఉపయోగించు కొనుటకు వీలుగా, ముఖ్యముగా పూర్వ శిక్షకుల కోసము ఒక PICCO మిషన్ కూడా ఏర్పాటు చేయడమైనది.
ఈ శిక్షణా తరగతులు, డిసెంబర్, 5, 2015 ప్రారంభమైన విషయము విదితమే. టైలరింగ్ తో పాటు, సేవా కార్యక్రమాలలో భాగంగా, గవర్నమెంట్ మెటర్నిటీ హోమ్, సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో వారు కుట్టున బొంతలు, కుల్లాలు, లంగోటాలు వారు కుట్టేనవే వారిచే పంపిణి గావింవ జేసీ, వాటికీ తోడుగా గర్భిణీ స్త్రీలకూ ఆపిల్ పండ్లను, కూడా ఇప్పించడమైనది. దీనిలో వారు పొందిన అనుభూతి వర్ణించలేము. .
పత్రీ బ్యాచ్లో వీరికి, Advanced Tailoring in Fashion Designing లో 25 ఐటమ్స్ తో ఒక ప్రత్యేక సిలబస్ తో పాటుగా నిక్కరును, మరియు షర్ట్ ను కూడా నేర్పాడము కూడా జరుగుతున్నది.
ఇప్పటి వరుకు శిక్షణ పొందిన వారు 50% వారి వారి గృహాలలో మరియు, వారి వారి స్థలాలలో, స్వయముగా, కుట్టు యంత్రములను ఏర్పరుచుకొని, డబ్బు సంపాదించుకొని, ఆనందపడుతున్నారు.
ఈ కరోనా సందర్భముగా ఈ కుట్టు కేంద్రం మార్చ్ 2020 నుండి నిన్నటి వరకు మూసి వుంచడమైనది.
కోవిద్ నిబంధనల ను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతము ఈ 14 వ బ్యాచ్ లో 10 మందితో ప్రారంభించుచున్నాము.
ముఖ్యముగా దాసా పద్మావతి గారు, 3 వ బ్యాచ్ లో శిక్షణ పొంది, 4 వ బ్యాచ్ నుండి వారు అందరికి శిక్షణ నివ్వటము ఏంతో గర్వించదగ్గ విషయము. అవసరమున్న వారిని గుర్తించి, వారికీ చేయుత నిచ్చుటకు కుట్టు యంత్రములను కూడా బహుకరించింది శ్రీ సత్య సాయి సేవ సంస్థ కోటి సమితి, హైదరాబాద్.
ఈ నాటి 14 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇన్ టైలోరింగ్ అండ్ ఫాషన్ డిజైన్ కోర్స్ ఈ రోజు నుండి,అనగా 5-12-2021 నుండి - మూడు నెలలు అంటే 5 -3 -2022 వరకు వరకు కొనసాగునని, కోటి సమితి కన్వీనర్, పి. విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. ఈ బ్యాచ్ లో మొత్తము 10 మంది పొందుతున్నట్లుగా వివరించారు. ఈ నాటికి 6 సంవత్సరములు పూర్తి చేసుకొని, 14 వ బ్యాచ్ ప్రారంభిచుకుంటున్న సందర్భముగా, కోచ్ పద్మావతి గారు కేక్ కట్ చేసి 14 బ్యాచ్ను ప్రారంభించారు. శ్రీ శ్రీశైలం హారతి సమర్పణతో కార్యక్రమము సంపూర్ణమైనది.
ఈ చిత్రములో శిక్షణ నిస్తున్న దాసా పద్మావతితో పాటు 14వ బ్యాచ్ శిక్షకులు. కూడా వున్నారు.
ఫోటో జత చేయడమైనది..
సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి . పి
Sairam 🙏🙏
ReplyDelete🙏OMSRISAIRAM🙏,
ReplyDelete*SERVICE TO HUMANITY IS SERVICE TO GOD మానవసేవయే మాధవసేవ*. Giving time to the needy as a part of daily routine, is none other than worshipping the Lord,following HIS🙏commandments.
పరోపకారమే సంస్కారంగా నిస్వార్థమైన సేవలను అందిస్తున్న కోటి సమితి కన్వీనర్ గారికి,సేవాదళ్ సభ్యులకు హృదయపూర్వక నమస్కారములు 🙏.(saraswatiprasad)
Sairama, 🙏🏻
ReplyDeleteఓం శ్రీ సాయిరామ్ 🙏 ఇలాంటి చక్కని సేవా కార్యక్రమాలను రూపొందించి, నిస్వార్ధంగా అమలు పరుస్తున్న శ్రీ సత్య సాయి సేవా సంస్థ, కోఠి సమితి నిర్వహణ బృందానికీ, బృంద రథసారథి శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారికి హృదయపూర్వక అభినందనలు
ReplyDeleteభగవాన్ బాబా వారి సంపూర్ణ ఆశీస్సులు అందరికీ కలుగును గాక 🙏🙏
SAIRAM
ReplyDeleteT V SUBBRAHMANYAM VIA WHATSAPP: SAIRAM 🙏
ReplyDeleteWith the Divine blessings of BABA VARU, SSSSS Kothi is taking up the Vocational course in Tailoring, Fashion Design and Fabric painting for the needy women and now the 14th batch is started.Through the skills, they can manage their livelihood, as it’s a self employment. Praying SWAMY VARU for the given opportunity. SAIRAM 🙏