Tuesday, September 19, 2023

19th Skill Development Trailoring Inauguration. 20-9-2023

          









                    శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్సెంటర్,   టైలోరింగ్ లో 

 19 వ బ్యాచ్ ప్రారంభం. 20-9-2023.

 శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్  సెంటర్, టైలోరింగ్ లో ఘనంగా    19 వ బ్యాచ్ ప్రారంభం

 20-9-2023 

మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చుటకు శ్రీ శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్   సెంటర్ ( టైలరింగ్లో ) ప్రతి మూడు నెలలకు 20 మంది స్థానిక గృహిణుల, సాధికారతఃను, సాధించేందుకు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్, ఆధ్వర్యంలో, గత 8 సంవత్సరములుగా,  ఉస్మాన్ గూంజ్ లో తోప్ ఖనాలో ప్రారంభమై, 18 బ్యాచ్లలో కుట్టు శిక్షణ, మరియు ఒక బ్యాచ్  వారికీ మెహందీ, బ్యూటిషన్, కోర్సులలో శిక్షణ నిచ్చారు. మూడు కుట్టు యంత్రములతో, ప్రారంభించిన ట్రైనింగ్ సెంటర్ 12 కుట్టు యంత్రములతో కొనసాగుతున్నది. ఇంతవరకు సుమారు  425 మంది శిక్షణ పొందినారు. అందరు ఉపయోగించు కొనుటకు వీలుగా, ముఖ్యముగా పూర్వ శిక్షకుల కోసము  ఒక PICCO మిషన్ కూడా ఏర్పాటు చేయడమైనది.

 ఈ శిక్షణా తరగతులు, డిసెంబర్, 5, 2015 ప్రారంభమైన విషయము విదితమే.  టైలరింగ్ తో పాటు, సేవా కార్యక్రమాలలో భాగంగా, గవర్నమెంట్ మెటర్నిటీ హోమ్, సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో వారు కుట్టున బొంతలు, కుల్లాలు, లంగోటాలు,  వారిచే పంపిణి గావింవ జేసీ, వాటికీ తోడుగా గర్భిణీ స్త్రీలకూ ఆపిల్ పండ్లను, కూడా ఇప్పించడమైనది. ఈ కార్యక్రమములో వారు పొందిన అనుభూతి వర్ణించలేము. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రతి నెలా  మహిళా దినోత్సవ వేడుకలను,   మరియు, సెల్ ఫోన్ లో వాట్సాప్, పేటీమ్, లొకేషన్ షేరింగ్, గూగుల్ మప్స్, షేరింగ్, తదితర అంశాలలో అవగాహన కావించుటకు శ్రీ మురళీకృష్ణ తో ఒక అవగాహనా సదస్సును,  ఏర్పాటు కావించి, వారిలో, కోరికల పై, అదుపు,  అలవాటు చేసుకొనే విధముగా, మరియు, కుట్టు యంత్రములో శ్రీ శైలం గారిచే మెకానిజం తరగతులను, 50 cm స్మార్ట్ టీవీ ద్వారా అనేక  కుట్టు సంబంధిత విషయాలలో అవగాహన కలిగించడమే కాకుండా,  వారు  అనేక  సేవా  కార్యక్రమాలలో, ఆశ్రిత కల్ప లో కాన్సర్ పేషెంట్స్ అటెండెంట్ లకు పలు సేవలు అందించటం, శివమ్ లో జరిగే పలు  కార్యక్రమాలలో,  పాల్గొనేటట్లుగా శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్  ట్రైనింగ్ సెంటర్ దోహదపడుతుంది.

పత్రీ బ్యాచ్లో వీరికి, Advanced Tailoring in Fashion Designing లో 25 ఐటమ్స్ తో ఒక ప్రత్యేక సిలబస్ తో పాటుగా  నిక్కరును, మరియు షర్ట్ ను కూడా నేర్పాడము కూడా  జరుగుతున్నది.

ఇప్పటి వరుకు శిక్షణ పొందిన వారు 50 శాతము  వారి వారి గృహాలలో మరియు, వారి వారి స్వా  స్థలాలలో, స్వయముగా, కుట్టుయంత్రములను    ఏర్పరుచుకొని, డబ్బు సంపాదించుకొని, ఆనందపడుతున్నారు.  

18 వ బ్యాచ్ లో శిక్షణ పొందిన ( 14 ) మందికి,  11-9--2023 న శివమ్ భజన హాల్ లో  ప్రముఖ శివమ్ భజన గాయని శ్రీమతి శర్మద గారు ప్రశంసా పత్రములను అందజేయనున్నారు. 

అవసరమున్న వారిని గుర్తించి, వారికీ చేయుత  నిచ్చుటకు కుట్టు యంత్రములను కూడా బహుకరించింది శ్రీ సత్య సాయి సేవ సంస్థలు  కోటి సమితి, హైదరాబాద్.

ఈ నాటి 19వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ Advanced Tailoring in Fashion Designing కోర్స్ లో  ఈ రోజు నుండి,అనగా 20-9-2023 నుండి -  మూడు నెలలు లేక 100 రోజులు  అంటే డిసెంబర్  30 వ తేదీవరకు 2023    వరకు కొనసాగునని, కోటి సమితి కన్వీనర్, పి. విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. ఈ బ్యాచ్ లో మొత్తము 20 మంది శిక్షణ  పొందనున్నారని  వివరించారు. ప్రముఖ భజన గాయకురాలు,  శ్రీమతి కల్పన   జ్యోతి ప్రకాశనం గావించి, వేదం, భజన, హనుమాన్ చాలీసా పఠించించిన అనంతరం, శ్రీమతి దాసా పద్మావతి, హుక్కు, కాజా టేప్ మిజర్మెంట్, 6 ముక్కల సారీ పెట్టి కోటు కటింగ్ డ్రాయింగ్ ద్వారా, మరియు పేపర్ కటింగ్ ద్వారా ఏంతో వివరముగా తెలియజేసారు. 

ఈ చిత్రములో శిక్షణ నిస్తున్న దాసా పద్మావతి, దాస వాణి,  పాటు 19 వ బ్యాచ్ శిక్షకులు కూడా వున్నారు. 

ఈ బ్యాచ్ లో కొన్ని మాత్రమే ఖాళీలు ఉన్నట్లు తెలుపుతూ, వారు 88865 09410 ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకొని అర్హతను బట్టి సీటు కేటాయించబడునని సమితి కన్వీనర్, పి విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. 






1 comment:

  1. HYDERABAD DISTRICT PRESIDENT SRI A MALLESWARA RAO'S WHATSAPP MESSAGE TO P V S Sai Ram Sir. Praying to Bhagawan to shower his choicest blessings on you and your team for the success of the 19th batch. Sairam

    ReplyDelete