Thursday, November 2, 2023


                                                                                




రిపోర్ట్ 2-11-2023. 


శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో  శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి, ఆధ్వర్యంలో, స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా, టైలరింగ్ లో, 19వ రెగ్యులర్, బ్యాచ్ తో పాటు, నాంపల్లి గవర్నమెంట్ జూనియర్  కాలేజ్  కమర్షియల్ గార్మెంట్  టెక్నాలజీ లో, శిక్షణ పొందుతున్న, ఇంటర్మీడియట్  ఫస్ట్,సెకండ్ ఇయర్ విద్యార్థులకు సుమారు 60 మంది కాలేజీలో థియరీ పార్ట్ కంప్లీట్ చేసుకుని, ప్రాక్టికల్ కోర్స్ కోసం, శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ టైలరింగ్ సెంటర్లో, ఈరోజు శిక్షణ  లాంచనంగా ప్రారంభింబడినది. ఈ ప్రారంభ తరగతి లో , డ్రెస్ పెట్టి కోట్, ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా కుట్టాలి, అనే విషయాలన్నీ, స్కిల్ డెవలప్మెంట్ గురువులు,  శ్రీమతి పద్మావతి, శ్రీమతి వాణి వివరించారు.  కాలేజీ విద్యార్థుల బృందంతో పాటు, శ్రీమతి కె  పద్మావతి లెక్చరర్ మాట్లాడుతూ, . ఈ కోర్స్ రెండు నెలలు కొనసాగునని,  కాలేజీకి ఏ రోజు సెలవు ఉంటుందో, సెంటర్లో  కూడా సెలవు ఉంటుందని నాంపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, పద్మావతి గారు వివరించారు.  కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి విద్యార్ధుల నుద్దేశించి మాట్లాడుతూ, ఈ రకమైన సేవను, ప్రసాదించిన స్వామికి, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరంతా, ఎంతో అదృష్టవంతులని, ఉన్నతమైన, శిక్షణ పొంది, ఇటు శ్రీ సత్యసాయి  సేవా సంస్థలకు, అటు మీ కాలేజీకి మంచి పేరు తీసుకుని వచ్చి, ప్రధానంగా, మీ తల్లిదండ్రులకు, సేవలందిస్తూ, ఎంతో క్రమశిక్షణతో ఉండాలన్నారు. కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గవిస్తూ, కాలేజీ  ప్రిన్సిపల్ పి  దుర్గ  గారికి, లెక్చరర్  పద్మావతీ గారికి కృతజ్ఞతలు తెలియ జేశారు. 








3-11-2023 












No comments:

Post a Comment