Wednesday, December 29, 2021
14TH SKILL DEVELOPMENT - TAILORING DEC 2021 4TH WEEK
Sunday, December 26, 2021
27-12-2021 SRISAILAM -MECHINE MACHANISM.
రేపు అనగా 27 -12 -2021 , సోమవారం శ్రీ శ్రీశైలం గారు మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు వచ్చెదరు. వారు కుట్టు మెషిన్ రిపేర్ చేయు విధానము తెలిపెదరు. అందరు 11 గంటల కల్లా రాగలరు. సాయిరాం. పి. విశ్వేశ్వర శాస్త్రి
Saturday, December 25, 2021
VISIT TO SKILL DEVELOPMENT CENTRE - OBSERVATIONS OF SMT BHUVANESWARI 25-12-2021
1) స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం 14వ బ్యాచ్ ప్రారంభం ,5/12/21
2)మొట్టమొదటి రిజిస్ట్రేషన్ అయిన 9
3) 10 మంది ఉన్నారు
4 ) ఆలస్యంగా 5 మంది వచ్చారు కల్పన, యాదమ్మ, స్వప్న, పద్మ, భవాని
5 ) అందరూ మాస్కులు వేసుకున్నారు
6 ) అందరూ డిస్టెన్స్ పాటిస్తున్నారు
7 ) ఇద్దరు టీచర్లు వచ్చారు
8 ). శ్రీమతి కల్పన తప్ప అందరూ టైం కి వచ్చారు
9 ) చెప్పుల కొద్దిగా వరుసక్రమంలో పెట్టాలని అనుకుంటున్నాను
10 ) అందరూ శానిటైజర్ పూసుకున్నారు
11) శిక్షణ పొందే వారు 10 మంది ఉన్నారు
12. రికార్డు బుక్కు ఈరోజు తే లేకపోయారు, మెయింటైన్ చేస్తున్నారు
13) నేను వెళ్లే సరికి 10 మంది ఉన్నారు, మరియు ఇద్దరు టీచర్లు ఉన్నారు
14) మిషన్ల మీద ఆరుగురు కూర్చున్నారు
15) గురువారం దీపం పెట్టారు
16) నిన్నటి రోజు పద్మ క్లీన్ చేసింది
17) శ్రీమతి విజయలక్ష్మి గారు, అబ్జర్వ్ చేయడానికి, ఇంతకుముందు వెళ్లారు
18) ఇప్పటి వరకు ఐదు అంశాలు నేర్చుకున్నారు
19) నేను అరటిపళ్ళు ప్రసాదం పంచాను
20) శ్రీమతి విజయలక్ష్మి గారు అరటిపళ్ళు ప్రసాదం పంచారు
Thursday, December 23, 2021
REPORT GIVEN TO RAJENDRA: DT 24-12-2021
23-12-2021:
ఈ రోజు శ్రీమతి విజయ లక్ష్మి గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను దర్సించారు.
భజన చేయించారు. (3) భజనలు. శ్రీమతి పద్మావతి గారు హారతి సమర్పించారు. వన్ డజన్ అరటి పండ్లను తీసుకొని వెళ్లారు.
============================================================
24-12-2021 MESSAGE SENT VIA WHATSAPP:
-----------------------------------------------------------------------------------------------------
Skill Development Course Tailoring started in Koti Samithi from 5-12-2015 onwards.
16-3-2020 to 4-12-2021: Skill Development Course Tailoring Centre Closed as per Hyd District President Orders.
Re-opened on 5-12-2021 - 01-01-2019 to 1-12-2021: Report 01-01-2019 to 15-3-2020 - 3 Batches Tailoring Course completed: 3 X 20 = 60 = 56 members Trained. 10th Batch to 13th Batch P V SASTRY.
Wednesday, December 8, 2021
14 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇన్ టైలోరింగ్ అండ్ ఫాషన్ డిజైన్ కోర్స్ 9-12-2021
10-12-2021: ఈ రోజు నేను మన ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ దర్శించలేదు. ఫోన్ ద్వారా అన్ని విషయములు తెలుసుకున్నాను. 7 మంది వచ్చినారు. కొందరు మెషిన్ పై కుట్టుచున్నారు. వీడియో లో అందరితో మాట్లాడినాను టీ, బిస్కీట్లు, 10 మందికి ఇవ్వడమైనది. శ్రీ చక్రధర్ సెంటర్ దర్షించినారు. ఈ రోజు కుచ్చులా ఫ్రాక్ శ్రీమతి పద్మావతి గారు నేర్పినారు. P V SASTRY
Saturday, December 4, 2021
14 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇన్ టైలోరింగ్ అండ్ ఫాషన్ డిజైన్ కోర్స్ ఈ రోజు నుండి 5-12-2021 ప్రారంభం మరియు 6 వ వార్షికోత్సవం
శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో 14 వ బ్యాచ్ ప్రారంభం. 5-12-2021
మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చుటకు ఏర్పడిన శ్రీ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ( టైలరింగ్లో ) ప్రతి మూడు నెలలకు 20 మంది స్థానిక గృహిణుల, సాధికారతఃను, సాధించేందుకు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్, ఆధ్వర్యంలో, గత 6 సంవత్సరములుగా, ఉస్మాన్ గూంజ్ లో తోప్ ఖనాలో ప్రారంభమై, 13 బ్యాచ్లలో కుట్టు శిక్షణ, మరియు ఒక బ్యాచ్ వారికీ మెహందీ, బ్యూటిషన్, కోర్సులలో శిక్షణ నిచ్చారు.మూడు కుట్టు యంత్రములతో, ప్రారంభించిన శ్రీ సత్య సాయి వొకటినల్ ట్రైనింగ్ సెంటర్ 10 కుట్టుయంత్రములతో కొనసాగుతున్నది. 240 మంది శిక్షణ పొందినారు. అందరు ఉపయోగించు కొనుటకు వీలుగా, ముఖ్యముగా పూర్వ శిక్షకుల కోసము ఒక PICCO మిషన్ కూడా ఏర్పాటు చేయడమైనది.
ఈ శిక్షణా తరగతులు, డిసెంబర్, 5, 2015 ప్రారంభమైన విషయము విదితమే. టైలరింగ్ తో పాటు, సేవా కార్యక్రమాలలో భాగంగా, గవర్నమెంట్ మెటర్నిటీ హోమ్, సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో వారు కుట్టున బొంతలు, కుల్లాలు, లంగోటాలు వారు కుట్టేనవే వారిచే పంపిణి గావింవ జేసీ, వాటికీ తోడుగా గర్భిణీ స్త్రీలకూ ఆపిల్ పండ్లను, కూడా ఇప్పించడమైనది. దీనిలో వారు పొందిన అనుభూతి వర్ణించలేము. .
పత్రీ బ్యాచ్లో వీరికి, Advanced Tailoring in Fashion Designing లో 25 ఐటమ్స్ తో ఒక ప్రత్యేక సిలబస్ తో పాటుగా నిక్కరును, మరియు షర్ట్ ను కూడా నేర్పాడము కూడా జరుగుతున్నది.
ఇప్పటి వరుకు శిక్షణ పొందిన వారు 50% వారి వారి గృహాలలో మరియు, వారి వారి స్థలాలలో, స్వయముగా, కుట్టు యంత్రములను ఏర్పరుచుకొని, డబ్బు సంపాదించుకొని, ఆనందపడుతున్నారు.
ఈ కరోనా సందర్భముగా ఈ కుట్టు కేంద్రం మార్చ్ 2020 నుండి నిన్నటి వరకు మూసి వుంచడమైనది.
కోవిద్ నిబంధనల ను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతము ఈ 14 వ బ్యాచ్ లో 10 మందితో ప్రారంభించుచున్నాము.
ముఖ్యముగా దాసా పద్మావతి గారు, 3 వ బ్యాచ్ లో శిక్షణ పొంది, 4 వ బ్యాచ్ నుండి వారు అందరికి శిక్షణ నివ్వటము ఏంతో గర్వించదగ్గ విషయము. అవసరమున్న వారిని గుర్తించి, వారికీ చేయుత నిచ్చుటకు కుట్టు యంత్రములను కూడా బహుకరించింది శ్రీ సత్య సాయి సేవ సంస్థ కోటి సమితి, హైదరాబాద్.
ఈ నాటి 14 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇన్ టైలోరింగ్ అండ్ ఫాషన్ డిజైన్ కోర్స్ ఈ రోజు నుండి,అనగా 5-12-2021 నుండి - మూడు నెలలు అంటే 5 -3 -2022 వరకు వరకు కొనసాగునని, కోటి సమితి కన్వీనర్, పి. విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. ఈ బ్యాచ్ లో మొత్తము 10 మంది పొందుతున్నట్లుగా వివరించారు. ఈ నాటికి 6 సంవత్సరములు పూర్తి చేసుకొని, 14 వ బ్యాచ్ ప్రారంభిచుకుంటున్న సందర్భముగా, కోచ్ పద్మావతి గారు కేక్ కట్ చేసి 14 బ్యాచ్ను ప్రారంభించారు. శ్రీ శ్రీశైలం హారతి సమర్పణతో కార్యక్రమము సంపూర్ణమైనది.
ఈ చిత్రములో శిక్షణ నిస్తున్న దాసా పద్మావతితో పాటు 14వ బ్యాచ్ శిక్షకులు. కూడా వున్నారు.
ఫోటో జత చేయడమైనది..
సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి . పి